సాంకేతికతల మేళవింపు గా ఉన్న తెలంగాణను కేసీఆర్ మూఢనమ్మకాల రాష్ట్రంగా మార్చారని, సచివాలయాన్ని కూల్చి ప్రజాధనాన్ని వృధా చేశారని విమర్శించారు ప్రధాని మోదీ( Narendra Modi )ఎన్నికల ప్రచారం లో బాగం గా మహబూబాబాద్, కరీంనగర్ లలో జరిగిన బజాపా సకల జనుల విజయసంకల్ప సభలో పాల్గొన్న మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.బీఆరఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించుకోవడం అంటే ఒక జబ్బును వదిలించుకొని మరో రోగాన్ని కొని తెచ్చుకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు .
తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి బారాస, కాంగ్రెస్లో ఒక్క అవకాశాన్ని కూడా వదలలేదని, కాంగ్రెస్ హయాంలోనే కరీంనగర్ ( Karimnagar )లో మావోయిస్టు హింస చెలరేగిందని, వామపక్ష తీవ్రవాదం పై భాజపా మాత్రమే కఠిన చర్యలు తీసుకుంటుంది అన్నారు .

కాంగ్రెస్( Congress ) తరపున ఎవరు గెలిచినా బారాసలో ఎప్పుడైనా చేరతారని, కాంగ్రెస్కు ఓటు వేయటం అంటే కేసీఆర్ను మరోసారి గద్దె ఎక్కించడమేనని వాళ్లకు తెలంగాణ ఏటీఎం అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.10 ఏళ్ల బాలుడు భవిష్యత్తు గురుంచి తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తారని, 10 ఏళ్ల వయసు గల తెలంగాణ గురించి కూడా తెలంగాణ ప్రజలు అంతే ఆలోచించాలని రాష్ట్రాన్ని దాని అదృష్టానికి దాన్ని వదిలేయలేమని అందుకే ప్రజలు అన్ని కోణాల్లో ఆలోచించి ఓటు వేయాలని మోదీ పిలుపునిచ్చారు.

నా నీడ పడితే సంపద పోతుందని కేసీఆర్ కి ఎవరో చెప్పినట్టున్నారు అందుకే నాకు ఎదురుపడటం లేదు, నేను ఎప్పుడు వచ్చినా 50 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారన్నారు .కుటుంబ పార్టీలతో వ్యక్తుల ప్రతిభకు ఎంతటి అన్యాయం జరుగుతుందో ఈ గడ్డను చూస్తే తెలుస్తుంది.ఈ నేల పీవీ నరసింహారావు లాంటి వ్యక్తిని అందించింది.
కానీ చనిపోయిన తర్వాత కూడా ఆయనను కాంగ్రెస్( Congress ) ఘోరంగా అవమానించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కరీంనగర్ ను లండన్ చేస్తామని చెప్పి కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపించారని, కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చినా కూడా అభివృద్ధి చేయలేదని అధికారంలోకి వస్తే కరీంనగర్ ను సిల్వర్ సిటీగా తీర్చిదిద్దేందుకు భాజపా కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.