తెలంగాణలో పొలిటికల్ హీట్ తారస్థాయిలో కొనసాగుతోంది.ముఖ్యంగా అధికార బిఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీల మద్య వాడివేడి విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
గడిచిన తొమ్మిదేళ్ల కేసిఆర్ పాలనపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తుంటే.హస్తం పార్టీ ప్రకటిస్తున్న హామీల విషయంలో బిఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తోంది.
ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ( Congress party ) నేతలు చేసిన కొన్ని విమర్శలు తిరిగి ఆ పార్టీనే ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తున్నాయి.ధరణి పోర్టల్, రైతుబంధు, 24 గంటల కరెంటు.
వీటిపై కాంగ్రెస్ చేసిన విమర్శలు చర్చనీయాంశం అవుతున్నాయి.

తాము అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేస్తామని హస్తం నేతలు చెబుతున్నారు.అలాగే రైతుబంధు( Rythu Bandhu ) విషయంలో కూడా మార్పులు చేస్తామని, 24 గంటల కరెంట్ అవసరం లేదని 5 గంటల కరెంటే సరిపోతుంది అనేలా ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే వీటిపై కాంగ్రెస్ నేతలు పూర్తి అవగాహనతోనే మాట్లాడుతున్నారా ? లేదా కేసిఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించేందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారరా ? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.అయితే కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేందుకు వీటినే ప్రధాన విమర్శనస్త్రాలుగా కేసిఆర్ ఉపయోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ ప్రచారల్లో ఎక్కువగా వీటిపైనే మాట్లాడుతుండడం గమనార్హం.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి( Dharani ) రద్దు చేస్తారని, రైతుబంధు ఆపేస్తారని, కరెంట్ ను 24 గంటల నుంచి 3 గంటలకే పరిమితం చేస్తారని కేసిఆర్ పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు.ఇంకా అస్త్రం పార్టీ హామీలు గ్యారెంటీ లేనివని.
హామీలు ఇవ్వడమే తప్ప అమలు చేయడం కాంగ్రెస్ నేతలకు తెలియదని కేసిఆర్ విమర్శిస్తున్నారు.అయితే హస్తం పార్టీపై ఎన్ని విమర్శలు చేసిన ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళడం లేదని అందుకే ధరణి, కరెంట్, రైతు బంధు విషయంలో అనాలోచితంగా హస్తంపార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలనే కేసిఆర్ విమర్శనస్త్రాలుగా సంధిస్తున్నారు.
మరి గతంతో పోల్చితే ప్రచారల్లోనూ మాటలు తుటాలు పేల్చడంలోనూ దూకుడు తగ్గించిన కేసిఆర్.కాంగ్రెస్ ను ఎంతవరకు నిలువరిస్తారో చూడాలి.