సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూస్తే జనాలు మరీ ఇంత వెర్రోళ్ళ లాగా ఉంటారా అనే అనుమానం కలగక మానదు.ఇలాంటి వీడియోలను సోషల్ మీడియా అకౌంట్ @సీసీటీవీ ఇడియట్స్ తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది.
తాజాగా ఈ సీసీటీవీ ఇడియట్స్( CCTV Idiots ) ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఓ వీడియో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.దీనికి ఇప్పటికే 17 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
పదివేల దాకా లైకులు వచ్చాయి.
ఏడు సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో ఓపెన్ చేస్తే మనకు ఒక ఫ్లోర్ పై పెద్ద పాము( Snake ) కనిపిస్తుంది.
ఒక వ్యక్తి ఆ పాము ముందుకు ఒక తెల్ల ఎలుకను పట్టుకుని వచ్చాడు.ఆ ఎలుకను ( Rat ) పాము ముందు ఉంచి దానిని తినేయమని సైగలు చేస్తూ ఉన్నాడు.
అప్పటికీ ఆ ఎలుక బతికే ఉంది. అయినా కొంచెం కూడా కనికరం లేకుండా పట్టుకార లాంటి ఒక వస్తువు తోటి ఎలుకను పాము ముందుకి తీసుకెళ్లాడు.

ఆ పాము అతడు ఊహించని ఒక పని చేసింది.అదేంటంటే ఎలుకని పట్టకుండా అతని చేతిని ( Hand ) తన పదునైన పళ్లతో కొరికేసింది.ఇది చాలా వేగంగా దాడి చేసింది.దాంతో అతడు తప్పించుకోలేక పోయాడు.పాము కాటుకు( Snake Bite ) గురయ్యాడు.అది విషపూరితమైన పాము హా లేదంటే విషం లేనిదా అనేది తెలియ రాలేదు.
కానీ సదరు వ్యక్తిని మాత్రం అది గాయపరిచింది.ఈ వీడియో చేసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
తగిన శాస్తి జరిగిందని కామెంట్లు పెడుతున్నారు.

ఇదొక రస్సెల్స్ వైపర్( Russels Viper ) అని, ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనదని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు.ఈ వీడియో తీస్తున్న వ్యక్తి బతికాడో లేదో చనిపోయాడో కూడా చెప్పడం కష్టమని ఇంకొందరు అన్నారు.అతను చనిపోతే మరి ఈ వీడియో ఎవరు షేర్ చేసి ఉంటారని ఇంకొందరు సందేహం వ్యక్తం చేశారు.
నేరుగా దేవుడి దగ్గరికి పోవడానికి ఇది ఒక మార్గం అని ఇంకొందరు ఫన్నీగా అతడి మూర్ఖత్వాన్ని విమర్శించారు.పాము పెద్ద ఎర మీదే కన్నేసిందని ఇంకొక నెటిజెన్ కామెంట్ చేశాడు.







