రానున్న లోక్ సభ ఎన్నికల( Lok Sabha Elections ) నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్( KCR ) బీ- ఫారాలను అందించారు.అనంతరం ఎన్నికల వ్యూహాలపై నేతలతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల( Parliament Elections ) నేపథ్యంలో ప్రచార సరళితో పాటు కార్యాచరణపై కేసీఆర్ కీలకంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది.ఎన్నికల్లో ఎలా పని చేయాలనే దానిపై నేతలకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు.
అదేవిధంగా ప్రచార సభలు, రోడ్ షోలపై ఈ సమావేశంలో నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.కాగా ఈ నెల 21 లేదా 22 నుంచి గులాబీ బాస్ కేసీఆర్ ప్రచారాన్ని నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.







