హుజురాబాద్ ఎన్నికల సందడి ముగియగానే స్పెషల్ మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.దీంతో ఈ ఎమ్మెల్సీ స్థానాలు ఎవరెవరు దక్కించుకోబోతున్నారు అనే విషయంలో సందిగ్ధత ఏర్పడింది.
ఇప్పుడు ఖాళీ అయిన ఆరు స్థానాలు, టిఆర్ఎస్ పార్టీ కే దక్కబోతూ ఉండడం తో వారి అనుగ్రహం ఎవరిపై ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎమ్మెల్సీ స్థానాలకు కెసిఆర్ చేయబోతుండటం, అలాగే గతంలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని చాలామందికి కేసీఆర్ హామీ ఇవ్వడం , ఆ లిస్ట్ భారీగా ఉండడంతో, ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరనేది అందరికీ ఆసక్తికరంగా మారింది.
అయితే కేసీఆర్ మాత్రం ఆ ఆరుగురు పేర్లను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీలుగా సీనియర్ నేత మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి (ఎస్సీ , వరంగల్ ) , తక్కెళ్లపల్లి రవీందర్ రావు ( ఓసి – నల్గొండ), పాడి కౌశిక్ రెడ్డి ( ఓసి – నల్గొండ ) , ఎల్ రమణ ( (బీసీ – కరీంనగర్ ), ఎంసీ కోటిరెడ్డి ( ఓసి – నల్గొండ) పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం అయితే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.
అయితే ఆరుగురు అభ్యర్థుల ఎంపిక విషయంలో సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యం కల్పించినట్లు కనిపిస్తున్నారు.మూడు స్థానాలు ఓసి కి, రెండు స్థానాలు బీసీకి, ఒకటి ఎస్సీ కి కేటాయించారట.
ఇక గవర్నర్ కోటా స్థానాన్ని కూడా ఓసీ కి కేటాయించినట్లు సమాచారం.మొత్తం ఎమ్మెల్యే, గవర్నర్ కోటాలో కలిపి ఏడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయబోతున్నారు.ప్రస్తుతం ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసినట్లుగా పేర్లు బయటకు రావడంతో ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న వారిలో తీవ్ర అసంతృప్తులు అప్పుడే మొదలయ్యాయి.అయితే కేసీఆర్ అధికారికంగా ఈ పేర్లను ప్రకటించిన తర్వాత ఏం చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలు ఎమ్మెల్సీ ఆశావాహులు ఉన్నారట.

హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టిఆర్ఎస్ ఇతర పార్టీలకు చెందిన నేతలను భారీగా చేర్చుకున్నారు.ఈ సందర్భంగా ఆయా నాయకులకు ఎమ్మెల్సీ, వివిధ నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.అయితే ఎన్నికల ఫలితాలు బోల్తా కొట్టడంతో ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చిన పాడి కౌశిక్ రెడ్డి రమణ వంటి వారికి నిరాశ తప్పదన్న అభిప్రాయం అందరిలోనూ ఉండగా కేసీఆర్ మాత్రం వారికి కూడా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించ పోతున్నారట .ఆ లిస్ట్ అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు అనేది తెలియక టిఆర్ఎస్ నాయకులు ఉత్కంఠగా ఎదురు చూపులు చూస్తున్నారు.