తెలంగాణ బీజేపీ లో( Telangana BJP ) గందరగోళం నెలకొంది.ఇప్పటికే పార్టీలో గ్రూపు రాజకీయాలు నెలకొన్న నేపథ్యంలో, పార్టీని ఇక్కడ పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావిస్తుండగానే, పార్టీలో కోవర్ట్ ల వ్యవహారం కలకలం రేపుతోంది.
తెలంగాణ బీజేపీ లో ఆశించిన స్థాయిలో చేరికలు లేకపోవడం బీజేపీ అధిష్టానం పెద్దలకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది.బిజెపిలో చేరికలను ఎక్కువగా ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా చేరికల కమిటీని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను( Etela Rajender ) నియమించారు.
ఇతర పార్టీల్లోని కీలక నేతలు చాలామంది బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న, చివరి నిమిషంలో వారి చేరికలు నిలిచిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.దీంతో పార్టీల్లో చేరికలు లేక తెలంగాణ బిజెపి ఆశించిన స్థాయిలో బలోపేతం కావడంలేదనే అసంతృప్తి పార్టీ అధిష్టానం పెద్దల్లో నెలకొంది.
బిజెపిలో చేరుకలు ఆశించిన స్థాయిలో లేకపోవడానికి కారణం పార్టీలో కోవర్ట్ లు ఎక్కువగా ఉండడమేనట.

దీంతో పార్టీలో కోవర్ట్ లు ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతుంది .తాజాగా బిజెపి నేత మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్( Ex MLA Nandeshwar Goud ) ఈ వ్యవహారం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ బిజెపిలో కోవర్ట్ లు ఉన్నారని , పార్టీలో అంతర్గతంగా తీసుకుంటున్న నిర్ణయాలు కేసిఆర్ కు చేరుతున్నాయని,( KCR ) కొంతమంది పార్టీలోని నేతలు కేసిఆర్ కు నమ్మిన బంటు లాగా వ్యవహరిస్తున్నారని, బిజెపి ఎదగకుండా వారే అడ్డుపడుతున్నారని నందీశ్వర్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే తెలంగాణ బిజెపిలో ఉన్న కేసీఆర్ కోవర్ట్ ల పేర్లు అధిష్టానం పెద్దలు దృష్టికి తీసుకెళ్లాలని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు.ఇప్పటికే తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ కు కోవర్ట్ ల పేర్లు చెప్పానని , అలాగే దానికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించానని నందీశ్వర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారాన్ని రేపుతున్నాయి.

పార్టీలో కోవర్టులు ఎవరు అనే విషయంపై అంతర్గతంగా చర్చ జరుగుతుంది.ఇటీవల కాలంలో బిజెపిలోకి చేరికలు ఎక్కువగా రావడంతో , కొత్త నేతలే కోవర్ట్ ఆపరేషన్ కు పాల్పడుతున్నారా ? పాత నేతల్లోనూ కోవర్ట్ లు.ఉన్నారా అనే దానిపై తెలంగాణ బిజెపిలో అంతర్గతంగా చర్చ నడుస్తోంది.ఈ వ్యవహారాలన్నీ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కు ఇబ్బందికరంగా మారాయి.
ఇప్పటికే తెలంగాణ బిజెపిని ప్రక్షాళన చేయాలని చూస్తున్న బిజెపి అధిష్టానం, అధ్యక్షుడిని కూడా మార్చాలనే ఆలోచనతో ఉంది.ఇదే సమయంలో కోవర్ట్ ల వ్యవహారం తెరపైకి రావడంతో, బీజేపీ అధిష్టానం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
