బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ ( Amithab Bachchan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటుడుగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అమితాబ్ ఇప్పటికీ పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.
ఇలా సినిమాలలో మాత్రమే కాకుండా బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కౌన్ బనేగా కరోడ్ పతి( Kaun Banega Karod Pati ) అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ కార్యక్రమం 14 సీజన్లను పూర్తి చేసుకుని 15వ సీజన్ ప్రారంభం కావడానికి సిద్ధమవుతోంది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అమితాబ్ బచ్చన్ ఈ కార్యక్రమాన్ని 2000 సంవత్సరంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమం ప్రారంభంలో ఈయన ఒక్కో ఎపిసోడ్ కు సుమారు 25 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్( Remuneration ) తీసుకున్నారు.ఇలా ఈ కార్యక్రమం ప్రసారమవుతున్న సమయం నుంచి ఇప్పటివరకు అమితాబ్ మాత్రమే వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ వచ్చారు.
అయితే సీజన్ సీజన్ కు అమితాబ్ రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలో పెరుగుతూ వచ్చింది.
ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ కార్యక్రమం 15వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సీజన్ కి అమితా వ్యాఖ్యాతగా వ్యవహరించడం కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.ఇలా కార్యక్రమం కోసం అమితాబ్ ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం.ఇలా ఒక్క ఎపిసోడ్ కి నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే అందరూ ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరి అమితాబ్ రెమ్యూనరేషన్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సంచలనంగా మారింది.