సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఒకానొక సమయంలో పలు సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కస్తూరి శంకర్( Kasturi Shankar ) ఒకరు.ఇలా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి అతి తక్కువ సమయంలోనే కస్తూరి శంకర్ ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఈమె హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలోనే తన తండ్రి తనకు పెళ్లి చేసి పంపించారు.ఇలా పెళ్లి తర్వాత ఆమె విదేశాలలో స్థిరపడ్డారు.
ఇలా ఇన్ని సంవత్సరాలు పాటు విదేశాలలో ఉన్నటువంటి ఈమె ఇటీవలే తిరిగి ఇండియాకి వచ్చి సినిమా ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు.
కస్తూరి శంకర్ ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
అదే విధంగా వెండితెర సినిమాలలోను వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు.ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఈమె సోషల్ మీడియా( Social Media ) వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ వార్తలలో నిలుస్తూ ఉంటారు.
ఇలా ఏ విషయం గురించి అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేసే కస్తూరి శంకర్ వివాదాలలో కూడా నిలుస్తూ ఉంటారు.ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక హీరో( Hero ) గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తను హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో ఒక హీరోతో తనకు ఏకంగా మూడు సినిమాలలో నటించే ఛాన్స్ వచ్చిందని తెలిపారు.
అయితే ఆ హీరోతో మొదటి సినిమా చేస్తున్న సమయంలోనే ఆయన నన్ను చాలా టార్చర్ పెట్టారని, ఆ టార్చర్ కారణంగా ఇబ్బందులు కూడా పడ్డానని తెలిపారు.కొన్నిసార్లు ఆయన తన లిమిట్స్ క్రాస్ చేసి మరి నన్ను ఇబ్బంది పెట్టేవారు.దీంతో నేను అసహనం వ్యక్తం చేశానని,అందుకే తిరిగి నాకు సినిమా ఇండస్ట్రీలో( Cinema Industry ) అవకాశాలు లేకుండా నా కెరియర్ ను నాశనం చేశారు అంటూ కస్తూరి శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.అయితే ఆ హీరో ఎవరు అనే విషయం మాత్రం ఈమె వెల్లడించలేదు.