Sitha ramam karthikeya 2 : కార్తికేయుడు వర్సెస్ సీతారాముడు.. టీవిలో ఎవరు నెగ్గారు ?

నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సీక్వెల్ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా అదరగొట్టింది.కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా ఏకంగా 120 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది.

 Karthikeya 2 V/s Sitha Ramam Movies Ratings In Tv, , Karthikeya 2 , Sitha Rama-TeluguStop.com

ఉన్న 15 కోట్లలో దేశ విదేశాల్లో షూటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు.పోర్చుగల్, స్పెయిన్, గ్రీస్ వంటి దేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది.

ఇంత భారీ ప్లానింగ్ ఉండి తక్కువ నిర్మాణ వ్యయంతో సినిమా చేయడం అంటే మెచ్చుకోదగ్గ విషయమే.వాస్తవానికి ఈ సినిమా మొదట కేవలం 53 షోలతోనే హిందీలో పడింది, కానీ ఆ సినిమా ఆ తర్వాత 1575 షోలకి పెంచాల్సి వచ్చింది ఆలా అనుకోకుండా హిట్ అయింది.

దానికి నిర్మాతలే ఆశ్చర్యపోయారంటే నమ్మండి.

అది మరి ప్రేక్షకుల డిమాండ్ అంటే, ఈ సినిమా తర్వాత అనుపమ, నిఖిల్ ఇద్దరు కూడా వారి వారి కెరియర్ లో చాలా మెట్లు ఎక్కారు అనే చెప్పొచ్చు.

నిఖిల్ సంగతి కాసేపు పక్కన పెడితే, సీతా రామం సినిమాతో దుల్కర్ కూడా తెలుగులో ఒక క్లాసిక్ సినిమా తీశాడు.సౌత్ ఇండియాలో ఈ చిత్రం బాగా ఆడింది.

ఖచ్చితంగా ఈ సినిమా గురించి ప్రస్తావించాల్సి వస్తుంది ఎందుకంటే తీసింది వై జయంతి మూవీస్.ఈ సినిమా కు సంబంధించి కథ, కథనం.

పాటలు ఇలా ప్రతి విషయం కూడా దగ్గర ఉండి చూసుకుంది ఆ ఇంటి పెద్ద కుమార్తె స్వప్న.కోట్లాది కోట్ల ఆస్తులు ఉన్న ఆచితూచి అడుగులు వేస్తున్నారు వైజయంతి మూవీస్ వారు.

Telugu Anupama, Chandoo Mondeti, Karthikeya, Mrunal Thakur, Nikhil, Sitha Ramam,

కేవలం 30 కోట్లతో కాశ్మీర్ అంటూ ఎక్కడెక్కడో తిరిగి షూటింగ్ పూర్తి చేశారు.అది స్వప్న గొప్పతనం అనే ఒప్పుకోక తప్పదు.ఎక్కడా కూడా వీసమెత్తు అసభ్యత లేని చిత్రం.అలాగే సున్నితమైన భావోద్వేగాలను ఎలాంటి వెగటుతనం లేకుండా రంగరించి కుటుంబమంతా కూడా చూసే చిత్రంగా మలిచింది హను రాఘవపూడి.ప్రత్యేకంగా కథ పైనే మంచి దృష్టి పెట్టాడు మౌత్ టాక్ తోనే ఈ సినిమా సూపర్ హిట్ అయింది.30 కోట్ల రూపాయలతో 100 కోట్ల రూపాయల వరకు సంపాదించింది ఈ చిత్రం.ఇక ఈ రెండు వేరు వేరు జోనర్స్ సినిమాలు అయినా కూడా ఒక విషయం గురించి ఖచ్చితంగా ప్రస్తావించాలి.స్టార్ మాటీవీలో ఈ చిత్రం నవంబర్ 20 న ప్రసారం అయింది.

దీనికి 8 వరకు రేటింగ్ వచ్చింది.అలాగే కార్తికేయ 2 సినిమా సైతం టీవీలో వచ్చింది కానీ ఎందుకో పెద్దగా ప్రేక్షకులు ఆదరించలేదు కేవలం 6.68 రేటింగ్ మాత్రమే వచ్చింది.అందుకే ఈ భిన్నమైన పోలిక.

ఈ రెండు చిత్రాలు గట్టిగా హిట్టు కొట్టినప్పటికీ రేటింగ్స్ విషయంలో మాత్రం దుల్కర్ గెలిచాడు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube