తెలుగులో ప్రముఖ ఛానల్ స్టార్ మా లో ప్రసారమయ్యేటువంటి కార్తీకదీపం సీరియల్ మంచి ప్రేక్షకాదరణ పొందింది.అంతేగాక ఈ సీరియల్ టీఆర్పి రేటింగులు పరంగా సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతోంది.
అయితే ఇందుకు ముఖ్య కారణంగా ఈ సీరియల్ లో దీప పాత్రలో నటించిన ప్రేమీ విశ్వనాధ్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.ఈమె ఒక తెలుగులోనే కాకుండా అటు మలయాళం ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంటోంది.
ఇప్పటికే పలువురు ఇళ్లల్లో ఈమె కుటుంబ సభ్యురాలుగా చేరిపోయింది.
అయితే తాజాగా ప్రేమి విశ్వనాథ్ కేరళ రాష్ట్రంలోని త్రిచూర్ ప్రాంతంలో ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించినటువంటి షాప్ ఇయా మెహందీ నైట్ అనే ఈ వేడుకకు హాజరయ్యారు.
ఇందులో భాగంగా తీసుకున్నటువంటి కొన్ని ఫోటోలను ప్రేమి విశ్వనాథ్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన అభిమానులతో పంచుకున్నారు.దీంతో ప్రేమి విశ్వనాధ్ అందానికి ముగ్ధులైన నటువంటి కొందరు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అంతేకాక మరికొందరైతే ఏకంగా సినిమాల్లో హీరోయిన్ గా ట్రై చేయొచ్చు కదా అని సలహాలు ఇస్తున్నారు.

ఏదేమైనప్పటికీ కార్తీక దీపం ద్వారా తెలుగులోకి ఇచ్చినటువంటి ప్రేమి విశ్వనాథ్ అనతికాలంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే గతంలో ఈ సీరియల్ లో భాగంగా దీప మరియు డాక్టర్ బాబు ని కలపాలంటూ ఏకంగా ఈ సీరియల్ అభిమానులు మహేష్ బాబుని కూడా రిక్వెస్ట్ చేశారు.అంతలా తెలుగు అభిమానులు ఈ సీరియల్ కి కనెక్ట్ అయిపోయారు.
ఇంతలా తనను అభిమానిస్తున్నటువంటి తెలుగు ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని పలు సందర్భాల్లో ప్రేమి విశ్వనాథ్ చెప్పుకొచ్చారు.
.