రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి2 సినిమాలు ఏ స్థాయిలో ఘనవిజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుని ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు నిర్మాతలకు ఊహించని స్థాయిలో లాభాలను అందించాయి.బాహుబలి2 సాధించిన కొన్ని రికార్డులు ఇప్పట్లో బ్రేక్ కావడం కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ బాహుబలి సాధించిన రికార్డులను బ్రేక్ చేసే అవకాశం అయితే ఉందని చాలామంది భావించారు.
తాజాగా పొన్నియన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్లో కార్తీ చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి.సినిమా రంగంలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నానని కార్తీ చెప్పుకొచ్చారు.
పొన్నియన్ సెల్వన్ లో నటించే ఛాన్స్ ఇచ్చినందుకు మణిరత్నంకు రుణపడి ఉన్నానని ఆయన వెల్లడించారు.

తనికెళ్ల భరణి గారు ఈ సినిమా కోసం డైలాగ్స్ రాశారని ఈ సినిమాలోని డైలాగులు చెప్పే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ను గుర్తు చేసుకుని చెప్పామని కార్తీ తెలిపారు.సీనియర్ ఎన్టీఆర్ లా డైలాగులు చెప్పడం సాధ్యం కాదని కార్తీ వెల్లడించారు.పొన్నియన్ సెల్వన్ బాహుబలిలా ఉంటుందా అని అందరూ అడుగుతున్నారని బాహుబలి అందరికీ నచ్చిన సినిమా అని కార్తీ కామెంట్లు చేయడం గమనార్హం.

మనకు బాహుబలి లాంటి సినిమాలు వద్దని మన దేశంలో ఎన్నో కథలు ఉన్నాయని ఎందరో హీరోలు ఉన్నారని వాటిని ప్రేక్షకులకు చెప్పాలంటూ కార్తీ కామెంట్లు చేయడం గమనార్హం.కార్తీ చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పొన్నియన్ సెల్వన్ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తుందో చూడాల్సి ఉంది.దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తోంది.







