మీ చెల్లిని అంటూ నోరు జారిన యాంకర్.. షాకింగ్ కౌంటర్ ఇచ్చిన త్రిష!

స్టార్ట్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్.ఈ సినిమా ఈనెల 30వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

 Trisha Krishnan Punch On Hariteja Comments In Ponniyin Selvan Event, Director Ma-TeluguStop.com

అయితే విడుదల తేదీకి కేవలం మరికొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు చిత్ర బృందం.

ఇక ఈ ఈవెంట్ ని హరిత, హేమంత్ ఇద్దరూ కలిసి హోస్ట్ చేశారు.

అయితే అప్పటివరకు బాగానే యాంకరింగ్ చేసిన హరిత ఆ తర్వాత త్రిష స్టేజి మీదకి రాగానే మాట్లాడడానికి కాస్త తడబడింది.

ఈ క్రమంలోనే త్రిష తో ఏం మాట్లాడాలో తెలీక హరిత తంటాలు పడింది.అసలు ఏం జరిగిందంటే.త్రిష మాట్లాడుతూ నేను హైదరాబాద్ కి చాలాకాలం తర్వాత మళ్లీ రావడం ఆనందంగా ఉంది అంటూ చాలా సంతోషంగా మాట్లాడుతుంది త్రిష.చాలా కాలం తరువాత తాను హైదరాబాద్ కు తిరిగి వచ్చిన కూడా అభిమానులు ఎంతో ప్రేమతో ఆప్యాయతతో ఆదరిస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు అని తెలుపుతుంది త్రిష.

అలాగే తనకు పొన్నియిన్ సెల్వన్ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు మణిరత్నం కు థాంక్స్ చెప్పింది.

తర్వాత వెంటనే హరితేజ మాట్లాడుతూ.నేను నా మొదటి సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మీతోనే కలిసిన నటించాను.ఆ సినిమాలో నేను మీ చెల్లిగా నటించాను.

అప్పుడు మీ వెనకే ఉండే దాన్ని అంటూ ఆనందంగా చెప్పింది హరితేజ.ఆ తర్వాత ఇంటికి వెళ్లి ప్రతిరోజు త్రిష నా ముందే ఉండేవారు అని అద్దంలో చూసుకుంటూ తెగ మురిసిపోయే దాన్ని అని తెలిపింది హరితేజ.

ఇప్పుడు మీతో పార్టీ కలిసి నటించాను ఇప్పుడు మీకు పోస్ట్ గా వ్యవహరిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అనటంతో వెంటనే త్రిష థ్యాంక్స్ చెబుతూ.నా వయసు పెరిగింది అన్న అనుభూతిని హరితేజ కలిగిస్తోంది.

అయినా పర్లేదు నేను ఆమె మాటని కాంప్లిమెంట్ గా తీసుకుంటాను అంటూ హరితేజ కి రివర్స్ పంచ్ వేసింది త్రిష.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube