మనిషికి అనుమానం, పరాయి స్త్రీల పట్ల ఆకర్షణ లాంటివి ఉంటే ఆ మనిషితో పాటు కుటుంబం కూడా చివరికి నాశనం అవుతుంది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఒక వ్యక్తి వివాహం అయిన మొదలు తరచూ భార్యను అనుమానించి నిత్యం వేధింపులకు గురిచేసేవాడు.
అంతటితో ఆగకుండా భార్య చెల్లెలిపై( Wife’s Sister ) మనసు పడ్డాడు.భార్య శీలాన్ని శంకించి ఆమెపై హత్యాయత్నం చేసి చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
కర్ణాటక రాష్ట్రంలోని( Karnataka ) మైసూర్ జిల్లా పిరియాపట్టణ తాలూకా ముత్తినముళ్లుసోగే గ్రామానికి చెందిన ప్రసన్న (36) అనే వ్యక్తికి శ్వేత (30)( Swetha ) అనే యువతితో ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం జరిగింది.వివాహం జరిగినప్పటి నుంచి శ్వేతపై అనుమానంతో నిత్యం వేధింపులకు గురి చేసేవాడు.
ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ లో పంచాయితీ జరిగితే పోలీసులు రాజీచేసి పంపించేవారు.

ప్రసన్న ఒకవైపు అనుమానంతో వేధించడంతోపాటు.మరోకవైపు శ్వేత చెల్లెలిపై మనసు పడ్డాడు.ఆమెను తనకిచ్చి పెళ్లి చేయాలని భార్యను ఒత్తిడి చేసేవాడు.
ప్రతిరోజు భర్త వేధిస్తూ ఉండడంతో విసిగిపోయిన శ్వేత నెల రోజుల క్రితం తన పుట్టింటికి వెళ్ళిపోయింది.

గురువారం ఉదయం శ్వేత ఏదో పని కోసం ఇంటి నుండి బయటకు వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రసన్న( Prasanna ) అడ్డగించి ఇంటికి వెళ్దామని శ్వేతను బలవంతం చేశాడు.శ్వేత ఇంటికి రావడానికి ససే మీద అనడంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.
స్థానికులు శ్వేతను గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం శ్వేత ఐసీయూ లో చికిత్స పొందుతోంది.మరొకవైపు ప్రసన్న తన ఇంటికి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







