బిగ్‌బాస్ హౌస్‌లో నేనే తోపు.. నన్ను చూసి భయపడ్డారంటున్న క‌రాటే కళ్యాణి!

వ‌ర‌ల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4.రెండు వారాలు పూర్తి చేసుకుని.

మూడో వారంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే.మొద‌టి వారం స‌త్యం డైరెక్ట‌ర్ సూర్య కిర‌ణ్ బ్యాగ్ స‌ద్దేశారు.

రెండో వారం నామినేష‌న్స్‌లో ఉన్న గంగవ్వ, నోయల్, కరాటే కళ్యాణి, మొనాల్ గజ్జర్, సొహైల్, అమ్మా రాజశేఖర్ కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్‌ల‌లో.క‌రాటే క‌ళ్యాణి ఎలిమినేట్ అయింది.

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బ‌య‌టకొచ్చిన క‌రాటే క‌ళ్యాణి.అసలు హౌస్‌లో ఏం జరుగుతుంది? తాను ఎందుకు బిగ్ బాస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాను? అనే వాటి గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియజేసింది.తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన క‌రాటే క‌ళ్యాణి.

Advertisement

త‌న‌ను వెన్నుపోటు పొడిచి బయటకు పంపించారంటూ హాట్ కామెంట్స్ చేసింది.అయితే నాకు వెన్నుపోటు రాజకీయం రాద‌ని.

అందుకే నేను బ‌య‌ట‌కు వ‌చ్చేశాస‌ని క‌ళ్యాణి చెప్పుకొచ్చింది.అలాగే బిగ్ బాస్ హౌస్‌లో నేను మిగిలిన వారిలో పోల్చుకుంటే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ని.

అందుకే నన్ను చూసి భయపడ్డారు.నన్ను తోసేస్తే వాళ్లకు సులువు అవుతుందని.

అందుకే న‌న్ను టార్గెట్ చేశారంటూ క‌ళ్యాణి చెప్పుకొచ్చింది.ఇక ఇంటి స‌భ్యులంద‌రూ మాస్క్ వేసుకుని ఆడుతున్నార‌ని.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

గంగ‌వ్వ సైతం మాస్క్‌తోనే ఆడుతుంద‌ని గుట్టు బ‌య‌ట పెట్టింది క‌ళ్యాణి.కానీ, నేను మాత్రం హార్ట్ ఫుల్‌గా ఆట ఆడానని తెలిపింది.

Advertisement

తాను బిగ్ బాస్ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక‌.ఎన్నో ఫోన్ కాల్స్‌, ఎన్నో మెసేజ్‌లు వ‌చ్చాయ‌ని.

ఫస్ట్ వీక్‌లో నన్ను తిట్టుకున్న ప్రేక్ష‌కులే.ఇప్పుడు న‌న్ను మిస్ అవుతున్నందుకు బాధ పడుతున్నార‌ని క‌రాటే క‌ళ్యాణి చెప్పుకొచ్చింది.

ఇక తాను రెండు వారాల్లోనే ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసినా.పది వారాలకు సరిపడే ఆధ‌ర‌ణ ల‌భించింద‌ని క‌రాటే క‌ళ్యాణి స్ప‌ష్టం చేసింది.

తాజా వార్తలు