కాపులను బీసీల్లో కలపాలంటూ ఉద్యమం చేసి రాష్ట్రంలో ఉన్న కాపులందరిలోనూ కదలిక తీసుకొచ్చిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం ! ఆయన చేసిన ఉద్యమం సందర్భంగా తుని లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ ఒక ఎత్తు అయితే ఆ మీటింగ్ అనంతరం రైలును ఉద్యమకారులు తగులబెట్టడం దేశవ్యాప్తంగా సంచనమే కలిగించింది.ఆ తరువాత తరువాత ఆ ఉద్యమాన్ని పోలీసులు అణిచివేయాలనుకోవడం, గొడవలు జరగడం ఇలా అనేక అనేక సంఘటనలతో ఆయన బాగా పాపులర్ అయిపోయాడు.
ఆ తరువాత ఆ ఉద్యమ ఊపు తగ్గిందన్నట్టు సైలెంట్ అయిపోయారు.కానీ మొన్న జగ్గంపేటలో జరిగిన మీటింగ్ లో జగన్ ఆ తుట్టును మళ్ళీ లేపడంతో మళ్ళీ ‘ కాపు ‘ రిజర్వేషన్ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.

తాజాగా ముద్రగడకు తెలుదేశం పార్టీ గేలం వేస్తోంది.ఎందుకంటే ఆయన జగన్ తో కలిసి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా అందరూ భావించారు.కానీ జగన్ తాజా ప్రకటనతో ముద్రగడ ఆయనతో కలిసి వెళ్లే అవకాశం లేదనేది స్పష్టం అయిపొయింది.దీంతో ఇప్పుడు ఆయన్ను టీడీపీ దగ్గరకు తీసుకోవాలని భావిస్తోంది.మొన్నటి వరకూ చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు ముద్రగడ పద్మనాభం.ఇచ్చిన హామీని అమలు చేయమని అడిగినందుకు చంద్రబాబు నాయుడు తనను హింసిస్తున్నాడని, తన ఇంట్లో వాళ్లపై పోలీసుల చేత బాబు దాడి చేయించాడని, లోకేష్ స్వయంగా ఆదేశాలు ఇచ్చి తమ కుటుంబంపై పోలీసులతో దాడి చేయించాడని ముద్రగడ ఆరోపించాడు.

అయితే.ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముద్రగడ టీడీపీలో చేరడం లాంఛనమే అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఆయనకు ఎంపీ టికెట్ కూడా ఖరారు అయ్యిందని ప్రచారం జరుగుతోంది.కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ ప్రకటనపై ముద్రగడ మండిపడ్డ సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయనను టీడీపీ మచ్చిక చేసుకుందని, ఆయనకు ఎంపీ టికెట్ ఆయన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేలా ఒప్పందం కూడా జరిగిపోయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అధికారం ఇస్తే ఆరు నెలల్లో కాపులకు రిజర్వేషన్లు అని చంద్రబాబు అప్పట్లో ప్రకటించాడు.
అయితే ఐదేళ్లు అవుతున్నా ఇప్పటికీ అది జరగలేదు.ఇక రిజర్వేషన్లు కావాలన్న కాపులపై టీడీపీ ప్రభుత్వం అణిచివేతకు పాల్పడింది.
అదే స్థాయిలో కాపు ఉద్యమకారులు కూడా టీడీపీ పై విరుచుకుపడ్డారు.మీరు నిజమైన కాపు అయితే టీడీపీకి ఓటు వెయ్యకండి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది.
కానీ ఇప్పుడు ముద్రగడ కుటుంబం టీడీపీ వైపు కనుక వెళితే కుల సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి అనేదే ప్రధానంగా అందరిలోనూ ఆసక్తి రేపుతోంది.







