తండ్రి చివరి కోరిక తీర్చినందుకు ఆ కూతుర్లకు దక్కింది బహిష్కరణ..ఇంతకీ వారి తండ్రి కోరిక ఏంటి?

కన్నతండ్రి చివరి కోరిక తీర్చినందుకు ఒక కుటుంబం కులాగ్రాహానికి గురై ,బహిష్కరించబడింది ఒక కుటుంబం.ఇంతకీ ఆ కుటుంబం చేసిన తప్పేంటంటే తండ్రి పాడే మోయడం.

 4 Girls Cremate Their Father Family Ostracised In Rajasthan-TeluguStop.com

కాని ఇక్కడ పాడేమోసింది కొడుకులు కాదు కూతుర్లు.కట్టుబాట్లకు విరుధ్దంగా ఆడపిల్లలు పాడే మోయడం ఏంటంటూ కులపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు వెలివేసారు.

ఇంత ఫాస్ట్ యుగంలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయి.

రాజస్థాన్‌లోని బుందీ జిల్లాలో రేగర్ సామాజిక వర్గానికి చెందిన దుర్గా శంకర్ అనే వ్యక్తి టైలర్ గా జీవనం సాగిస్తూ,అక్కడే నివాసం ఉండేవాడు.శంకర్ వయసు 60 ఏళ్లు.దుర్గా శంకర్ కి నలుగురు కూతుళ్లు.

భార్యా పిల్లలతో రేగర్ కాలనిలో నివాసం ఉండే ఆయన హఠాత్తుగా చనిపోయాడు.కొడుకులు లేకపోవడంతో.

దుర్గా శంకర్ తన నలుగురు కూతుళ్లనే కొడుకుల్లా భావించేవాడు.వారిని కొడుకుల్లానే పెంచాడు.

తను చనిపోయాక వారే పాడె మోయాలనేది ఆయన చివరి కోరిక.తండ్రి ఆఖరి కోరిక నెరవేర్చడానికి నలుగురు కూతుళ్లు ముందుకొచ్చారు.

కానీ సంప్రదాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తే.కులం నుంచి బహిష్కరిస్తామని పెద్దలు హెచ్చరించారు.

అయినా వెనక్కి తగ్గకుండా.వారు తమ తండ్రి అంతిమ యాత్ర నిర్వహించారు.

అంతిమ సంస్కారాలు అయిపోయాక, తప్పు చేశామని ఒప్పుకోవాలని కులపెద్దలు వారికి సూచించారు.కానీ వారు అందుకు అంగీకరించలేదు.దీంతో మృతుడి భార్య, నలుగురు కూతుళ్లు స్నానాలు చేయడానికి వీల్లేకుండా.శ్మశానం దగ్గర్లోని తమ కమ్యూనిటీ కాంప్లెక్స్‌కు తాళం వేశారు.కులస్తులెవరూ వారికి భోజనం పెట్టడానికి ముందుకు రాలేదు.దీంతో వారు ఇంటికెళ్లి స్నానాలు చేసి,ఇ:ట్లో వారే వంట చేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.తండ్రి పాడె మోసినిందుకు సమాజం దోషుల్లా చూస్తున్నప్పటికి తమ తండ్రి కోరిక తీర్చామనే సంతృప్తి ఉందంటున్నారు ఆ అక్కా చెల్లెల్లు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube