Kantara OTT : కాంతార ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం కాంతార.ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ విడుదలై ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాని వివిధ భాషలలో విడుదల చేశారు.

 Kantara Ott Release Date Fixed When Is Streaming , Kantara Ott , Date Fixed, Ama-TeluguStop.com

ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీన తెలుగులో విడుదల అయ్యి తెలుగులో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇలా తెలుగులో మాత్రమే కాకుండా వివిధ భాషలలో ప్రసారమైనటువంటి ఈ సినిమా ఏకంగా 350 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

ఈ విధంగా థియేటర్లో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాని ఓటీటీలో చూడటం కోసం అభిమానులు ఎంతో ఆతృత కనబరుస్తున్నారు.ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరలకు కొనుగోలు చేశారు.

ఈ సినిమాని నవంబర్ 4వ తేదీనే ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే ఈ విషయంపై స్పందించిన నిర్మాతలు ఇప్పుడప్పుడే తమ సినిమా ఓటీటీలో రాదని వెల్లడించారు.

Telugu Amazon Prime, Fixed, Kantara Ott-Movie

ఇకపోతే తాజాగా ఒక అభిమాని అమెజాన్ హెల్ప్ అధికారక ఖాతాకు ఈ సినిమా గురించి చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది.ఈ సినిమాని ఎప్పుడు ఓటీటీలో విడుదల చేస్తారు అంటూ రిక్వెస్ట్ గా ట్వీట్ చేశారు.ఇక ఈ విషయంపై అమెజాన్ హెల్ప్ స్పందించి ఈ సినిమాని నవంబర్ 24వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు అంటూ క్లారిటీ ఇచ్చారు.ఈ విధంగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి ట్వీట్ చేసిన కొంత సమయానికి ఆ ట్వీట్ డిలీట్ చేయడంతో ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తున్నారా లేకపోతే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube