కాంతార ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం కాంతార.

ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ విడుదలై ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాని వివిధ భాషలలో విడుదల చేశారు.

ఈ సినిమా అక్టోబర్ 15వ తేదీన తెలుగులో విడుదల అయ్యి తెలుగులో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా తెలుగులో మాత్రమే కాకుండా వివిధ భాషలలో ప్రసారమైనటువంటి ఈ సినిమా ఏకంగా 350 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.

ఈ విధంగా థియేటర్లో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాని ఓటీటీలో చూడటం కోసం అభిమానులు ఎంతో ఆతృత కనబరుస్తున్నారు.

ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరలకు కొనుగోలు చేశారు.

ఈ సినిమాని నవంబర్ 4వ తేదీనే ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఈ విషయంపై స్పందించిన నిర్మాతలు ఇప్పుడప్పుడే తమ సినిమా ఓటీటీలో రాదని వెల్లడించారు.

"""/"/ ఇకపోతే తాజాగా ఒక అభిమాని అమెజాన్ హెల్ప్ అధికారక ఖాతాకు ఈ సినిమా గురించి చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది.

ఈ సినిమాని ఎప్పుడు ఓటీటీలో విడుదల చేస్తారు అంటూ రిక్వెస్ట్ గా ట్వీట్ చేశారు.

ఇక ఈ విషయంపై అమెజాన్ హెల్ప్ స్పందించి ఈ సినిమాని నవంబర్ 24వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు అంటూ క్లారిటీ ఇచ్చారు.

ఈ విధంగా ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి ట్వీట్ చేసిన కొంత సమయానికి ఆ ట్వీట్ డిలీట్ చేయడంతో ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తున్నారా లేకపోతే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

ఆరోగ్యానికి వరం కర్బూజ గింజలు.. రోజూ తింటే లాభాలే లాభాలు!