దక్షిణాది భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో రమ్య( Ramya )(దివ్య స్పందన) ఒకరు.తెలుగులో రమ్య అభిమన్యు అనే సినిమాలో నటించగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదనే సంగతి తెలిసిందే.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ నటి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
రమ్య మాట్లాడుతూ నా తల్లీదండ్రులే నాకు ప్రాణమని అన్నారు.
నాన్న చనిపోయిన రెండు వారాలకే నేను పార్లమెంట్( Parliament) లో అడుగుపెట్టాల్సి వచ్చిందని ఆమె కామెంట్లు చేశారు.ఆ సమయానికి పార్లమెంట్ కార్యకలాపాల గురించి నాకు పెద్దగా అవగాహన లేదని ఆమె అన్నారు.
అయినప్పటికీ నేను ప్రతి విషయాన్ని నేర్చుకున్నానని రమ్య చెప్పుకొచ్చారు.నేను నా బాధను పనివైపు మళ్లించానని ఆమె కామెంట్లు చేశారు.

మాండ్యా ప్రజలే( Mandya people ) నాకు ఆ శక్తిని ఇచ్చారని రమ్య తెలిపారు.నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిన వాళ్లలో రాహుల్ గాంధీ( Rahul Gandhi ) ఒకరని రమ్య చెప్పుకొచ్చారు.నాన్న మరణం వల్ల నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని రమ్య కామెంట్లు చేశారు.మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయానని ఆ సమయంలో రాహుల్ గాంధీ అండగా నిలిచారని రమ్య చెప్పుకొచ్చారు.
ఆయన మానసికంగా ధైర్యం ఇచ్చారని ఆమె చెప్పుకొచ్చారు.

రమ్య 2012 సంవత్సరంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వగా 2013 సంవత్సరంలో మాండ్య లోక్ సభ స్థానానికి ఉపఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.2014 ఎన్నికల్లో మాత్రం ఆమె ఓడిపోయారు.ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్న రమ్య సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది.
ఉత్తరాకాండ అనే సినిమాతో ఆమె సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది.సెకండ్ ఇన్నింగ్స్ లో రమ్య కెరీర్ పరంగా ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.







