అత్యాచారం కేసులో ఆస్ట్రేలియా ( Australia ) నుంచి బహిష్కరణకు గురైన వ్యక్తిని హిమాచల్‌ప్రదేశ్ పోలీసులు( Himachal Pradesh Police ) అదుపులోకి తీసుకున్నారు.ఇప్పటికే అతని కోసం ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయగా.
సీబీఐ, హిమాచల్ ప్రదేశ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌తో బుధవారం అరెస్ట్ చేశారు.నిందితుడిని విక్రమ్ సింగ్‌గా( Vikram Singh ) గుర్తించారు.
అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతనిపై హిమాచల్ ప్రదేశ్ పోలీసుల అభ్యర్ధన మేరకు జూన్ 23, 2021న ఇంటర్‌పోల్ ‘‘రెడ్ కార్నర్ నోటీసులు’’ జారీ చేసింది.నేషనల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఆస్ట్రేలియా, హిమాచల్‌ప్రదేశ్ పోలీసుల సహాయంతో సీబీఐ ఈ ఆపరేషన్‌ను సమన్వయం చేసింది.

పరారీలో వున్న నేరస్థుడిని తిరిగి భారత్‌కు తీసుకురావడానికి బృందాన్ని పంపాల్సిందిగా ఇక్కడి ఏజెన్సీలు ముందుగానే సమాచారం అందించారు.విక్రమ్ సింగ్‌ను ఆస్ట్రేలియా నుంచి బహిష్కరించగా, అతను సోమవారం ఢిల్లీకి రాగానే హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కాగా.14 నెలల క్రితం సీబీఐ ప్రారంభించిన ‘‘ఆపరేషన్ త్రిశూల్’’ కింద 34 మంది నేరగాళ్లను వివిధ దేశాల నుంచి బహిష్కరించడం లేదా అప్పగించడం జరిగిందని అధికారులు తెలిపారు.‘ఆపరేషన్ త్రిశూల్’ కింద పారిపోయిన వ్యక్తులను కార్నర్ చేయడానికి సీబీఐ త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది.

తొలుత ఇంటర్‌పోల్ ద్వారా పారిపోయిన వ్యక్తిని గుర్తించడం, అతనిని బహిష్కరించడం, సదరు దేశం నుంచి వెనక్కి రప్పించడం వంటి విధానాలతో సీబీఐ సక్సెస్ అయ్యింది.అంతేకాకుండా ఇంటర్‌పోల్ మెకానిజమ్‌లను కూడా సీబీఐ సమీకరించింది.స్టార్ గ్లోబల్ ఫోకల్ పాయింట్ నెట్‌వర్క్, ఫైనాన్షియల్ క్రైమ్ అనాలిసిస్ ఫైల్స్ వంటి ఛానెల్స్ ద్వారా ఆర్ధిక నేరగాళ్ల ఆదాయాన్ని చెదరగొట్టడం, గుర్తించడం వంటి చర్యలు తీసుకుంది.
షెల్ కంపెనీలు, మోసపూరిత లావాదేవీలు, మనీ మ్యూల్స్‌కు పాల్పడిన నిందితుల క్రిమినల్ ఇంటెలిజెన్స్‌ను రూపొందించడం ద్వారా వారికి మద్ధతుగా వున్న నెట్‌వర్క్‌లను విడదీస్తుంది.దీని వల్ల లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు తగిన చర్యలు తీసుకోవడానికి ఇంటర్‌పోల్ ద్వారా సమాచారం అందించవచ్చు.








