కన్నా లేఖపై బీజేపీ అధిష్టానం సీరియస్ ? వేటు తప్పదా ?

అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా కాకుండా, సొంత నిర్ణయాలు తీసుకుంటూ, సొంత అభిప్రాయం పార్టీ అభిప్రాయంగా వ్యక్తం చేస్తూ వస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పై మరోసారి బిజెపి అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఏపీ వికేంద్రీకరణ బిల్లును ఆమోదించవద్దని, దానిని తిరస్కరిస్తూ ప్రభుత్వానికి తిరిగి పంపించాలంటూ కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయడంపై ఇప్పుడు బీజేపీ అధిష్టానం ఆగ్రహంగా ఉందట.

కేంద్ర బిజెపి పెద్దల అభిప్రాయం ఏమిటో తెలుసుకోకుండానే కన్నా ఈ విధంగా లేఖ ఎలా రాస్తారు అంటూ బీజేపీ అధిష్టానం మండిపడుతున్నట్లు తెలుస్తోంది.మొదటి నుంచి మూడు రాజధానుల విషయంలోనూ, అమరావతి విషయంలోనూ బీజేపీ వైఖరి రకరకాలుగా ఉంటూ వస్తోంది.

ముఖ్యంగా ఏపీ బీజేపీ మూడు గ్రూపులుగా ఉండడం, జగన్ కు మద్దతు ఇచ్చే వర్గం ఒకటైతే, టిడిపి కి అనుకూలంగా వ్యవహరిస్తూ మరో వర్గం, బీజేపీ అధిష్టానం చెప్పింది తూచా తప్పకుండా పాటించే మరో వర్గం.ఈ మూడు గ్రూపుల మధ్య మొదటి నుంచి ఏకాభిప్రాయం లేకపోవడంతో, ఏపీ బిజెపి గందరగోళంలోనే ఉంటూ వస్తోంది.

మొదటి నుంచి బీజేపీ కేంద్ర పెద్దలు ఏపీ రాజధాని విషయంలో తాము చేసుకోమని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెబుతూనే వస్తున్నారు.మూడు రాజధానులు ఏర్పాటు చేసే అంశంలోనూ ఇదే వైఖరిని కనబరిచారు.

Advertisement

రాష్ట్రంలో రాజధాని ఎక్కడైనా ఏర్పాటు చేసుకుని వెసులుబాటు ప్రభుత్వానికి ఉందంటూ పలు సందర్భాల్లో బిజెపి పెద్దలు చెప్పారు.

కానీ కేంద్ర బీజేపీ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా కన్నా లక్ష్మీనారాయణ మూడు రాజధానుల విషయంపై గవర్నర్ కు లేఖ రాయడంపై బిజెపి అధిష్టానం సీరియస్ గా తీసుకుంది.మొదటి నుంచి కన్నా టిడిపి ట్రాప్ లో పడి వ్యవహరిస్తున్నారని అధిష్టానం గతంలోనే హెచ్చరింది.కేంద్ర బిజెపి పెద్దల అనుమతి లేకుండా, ఏ విషయంపైన స్పందించ వద్దని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ, బీజేపీకి ఒక్క మాటగానే ఉండాలంటూ సూచించింది.

అయినా ఇప్పుడు కేంద్ర పెద్దల అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండానే, కన్నా దూకుడుగా లేఖ రాయడం పై గుర్రుగా ఉన్న బీజేపీ అధిష్టానం అధ్యక్ష పదవి నుంచి కన్నాను తప్పిస్తే కానీ, బిజెపి ఏపీలో పుంజుకోదని, టీడీపీ ట్రాప్ లో ఉంటూ ఎదిగే అవకాశం కోల్పోతుందనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.

ఏపీ బీజేపీ నాయకులంతా మరోసారి గవర్నర్ ను కలిస కన్నా రాసిన లేఖపైనా, మూడు రాజధానులు అంశం పైన క్లారిటీ ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారట.గతంలోనే పార్లమెంట్ లో హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ మూడు రాజధానుల ఏర్పాటు చేసే విషయంపై కేంద్రం జోక్యం చేసుకోదని, పూర్తిగా అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అంటూ చెప్పారు.కానీ కన్నా అవేమీ పట్టించుకోకుండా, తన సొంత అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయంగా పేర్కొంటూ లేఖ రాయడం పార్టీని ధిక్కరించడమేననే అభిప్రాయానికి వచ్చిన బీజేపీ పెద్దలు త్వరలోనే కన్నాకు చెక్ పెట్టి, ఆస్థానంలో మరో నాయకుడిని నియమించే విషయంపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు