ప్రజావేదిక కూల్చివేతపై వైసీపీ కి సూచనలు చేసిన కన్నా లక్ష్మీనారాయణ

ఇటీవల ఏపీ రాజకీయాల్లో ప్రజావేదిక అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.

గత ప్రభుత్వ హయం లో నిర్మించిన ఈ కట్టడం అక్రమంగా కట్టారని ఆరోపిస్తూ వైసీపీ సర్కార్ తాజాగా ఈ కట్టడాన్ని కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ కూల్చి వేతపై బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మియే నారాయణ స్పందించారు.గత ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని అక్రమంగా నిర్మించి ఉంటే ఇలా చర్యలు తీసుకోవాలి తప్ప అనోసరంగా కక్షపూరితంగా కూలగొట్టే ఆలోచన చేస్తే మాత్రం విమరించుకోవాలి అని వైసీపీ కి సూచించారు.

అన్ని కోట్లు ప్రజా ధనాన్ని ఖర్చుపెట్టి నిర్మించిన ఈ కట్టడాన్ని ప్రజలకు ఉపయోగపడేలా ఉపయోగించాలి అని, ఇలా ప్రజాధనాన్ని కాల్వ పాలు చేయడం సరికాదంటూ ఆయన అభిప్రాయపడ్డారు.కృష్ణా నది కరకట్ట వద్ద నిర్మించిన ప్రజావేదిక తమకు కేటాయించాలి అంటూ ఏపీ మాజీ సి ఎం చంద్రబాబు సీఎం జగన్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే.

అయితే బాబు లేఖను ఏమాత్రం పట్టించుకోని జగన్ ప్రజావేదికను హ్యాండోవర్ చేసుకోవడమే కాకుండా అది అక్రమ కట్టడం అంటూ మంగళవారం అర్ధరాత్రి నుంచి కూల్చి వేత కార్యక్రమాన్ని చేపట్టింది.దీనితో దాదాపు 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ఈ కట్టడం ఇప్పుడు నేలమట్టం అయిపోతుంది.

Advertisement

ఈ క్రమంలో కన్నా స్పందిస్తూ కృష్ణా నది కరకట్ట వెంట ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేస్తామంటే తమకేమీ అభ్యంతరం లేదని, కానీ ఒక్క ప్రజావేదిక మాత్రమే కూల్చాలనుకుంటే సరికాదని ఆయన అన్నారు.అలానే కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవ్వకూడదనే ఉద్దేశ్యం తో ప్రజావేదికను కూల్చడం కన్నా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకి వినియోగించడం మేలని ఆయన అభిప్రాయపడ్డారు.

కడప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు