విమర్శలే విజయాలవుతాయి... కంగనా విషయంలో అది ప్రూవ్

కంగనా రనౌత్.ఈ పేరు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక ఫైర్ బ్రాండ్.

అవకాశాల కోసం దర్శక, నిర్మాతల చుట్టూ తిరిగిన రోజుల నుంచి ఇప్పుడు ఏకంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో సమానంగా భారీ బడ్జెట్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారేంత వరకు ఆమె ప్రయాణం అంతా కూడా అవమానాలు, అవరోదాలతో నడిచింది.అయితే ఇప్పుడు బాలీవుడ్ సినిమా అంటే రెండు వర్గాలుగా ఉంది.

ఒకటి కంగనాని వ్యక్తిరేకించే వారు.రెండోది కంగనా వెంట నడిచేవారు.

దీనికి కారణం ఆమె బాలీవుడ్ లో స్టార్స్ వారసులు, ఇండస్ట్రీని శాసిస్తున్న వారిని డైరెక్ట్ గా పేరు పెట్టి మరీ ప్రశ్నించింది.వేలెత్తి చూపించి వారు చేసిన తప్పులని సమాజానికి పరిచయం చేసింది.

Advertisement

బాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్తవాళ్లని ఎదగనీయకుండా ఎంత దారుణంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తారో మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది.లెజెండరీ దర్శకులమని చెప్పుకునే వారి జాతకాలని కూడా రోడ్డున పెట్టింది.

ఈ కారణంగా ఆమెని బాలీవుడ్ లో సెలబ్రిటీ వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారు.అలాగే వారిని ప్రోత్సహిస్తూ ఉన్నవారు కంగనాని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు.

అయితే కంగనాని కంట్రోల్ చేసే స్థాయిలో ఇప్పుడు వారు లేరని చెప్పాలి.ఆమె డామినేషన్ ముందు అందరూ కూడా క్రింద పడిపోయారు.

విమర్శలే విజయాలవుతాయని ఓ సామెత కంగనా రనౌత్ విషయంలో కచ్చితంగా జరిగిందని చెప్పాలి.ఆమెని బాలీవుడ్ లో ఎంతగా అణగదొక్కాలని ప్రయత్నం చేసిన, ఎంత మంది ఎన్ని విధాలుగా విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే తెగింపు ఆమెకి ఉంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

నేరుగా మహారాష్ట్ర సర్కార్ శివసేనతోనే ఆమె కయ్యం పెట్టుకొని ముందుకి దూసుకుతుంది.ఇదిలా ఉంటే బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కి సాధ్యం కాని అరుదైన ఘనతని ఇప్పుడు కంగనా సొంతం చేసుకుంది.

Advertisement

ఏకంగా జాతీయ స్థాయిలో నాలుగు సార్లు ఉత్తమ నటి అవార్డులు తీసుకొని నటిగా తనకి తిరుగులేదని ప్రూవ్ చేసుకుంది.అందుకే తాను నటిని అని కంగనా గర్వంగా చెబుతుంది.

అయితే అలా చెప్పుకోవడంలో ఆమె వ్యతిరేకించే వారికి గర్వం కనిపిస్తే చాలా మందికి ఆమె ఆత్మవిశ్వాసం, తెగింపు కనిపిస్తాయి.అందుకే బాలీవుడ్ అంతా కంగనాని వ్యతిరేకించి సినిమా ప్రేక్షకులు, దేశ ప్రజలు మాత్రం కంగనా వైపు నిలబడ్డారు.

ఆమె సినిమాలకి బ్రహ్మరథం పడుతున్నారు.

తాజా వార్తలు