నేను హీరోల గదులకు వెళ్లకపోవడం వల్లే నాకు ఈ పరిస్థితి.. సంచలన వాఖ్యలు చేసిన నటి?

కాస్టింగ్ కౌచ్. సినిమా ఇండస్ట్రీతో పాటు అన్ని రంగాల్లోనూ ఈ పేరు వినిపిస్తూనే ఉంటుంది.

 Kangana Ranaut Slams Bollywood Was Bhikari Film Mafia Details, Kangana Ranaut, B-TeluguStop.com

కానీ ఇతర రంగాలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ కౌచ్ అన్న పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు వారికి జీవితంలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్న విషయం తెలిసిందే.

కొందరు ధైర్యంగా మీడియా ముందు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.ఇకపోతే రజక కాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సంచలను వ్యాఖ్యలు చేసింది.

కాస్టింగ్ కౌచ్ విషయంలో ఆమెపై కుట్రలు చేయడం మాత్రమే కాకుండా జైలుకు కూడా పంపేందుకు సిద్ధమైనట్లు ఆమె చెప్పుకొచ్చింది.

తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది కంగనా రనౌత్. అంతేకాకుండా అప్పుడప్పుడు కాంట్రవర్సీల విషయంలో కూడా సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది.బాలీవుడ్ నటిగా మాత్రమే కాకుండా ఫైర్ బ్రాండ్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది కంగనా రనౌత్.

ఇది ఇలా ఉంటే ఇటీవలే ఆమె తన తల్లి పొలంలో పనిచేస్తున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.తన తల్లి ఒక బాలీవుడ్ హీరోయిన్ కు తల్లి అయినప్పటికీ నేటికీ వ్యవసాయం చేస్తూ తన అభిరుచుని చాటుకుంటోంది అని రాసుకొచ్చింది కంగనా రనౌత్.

ఈ నేపథ్యంలోనే ఒక నెటిజన్ ఆ ఫోటోని చూసి లక్షాధికారి అయిన తర్వాత కూడా.కంగనా తల్లి పొలంలో పనిచేస్తోంది.ఆమె చాలా సింపుల్ సిటీతో ఉంది అని రాసుకొచ్చాడు.

ఆ విషయం పై స్పందించిన కంగనా రనౌత్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చింది.దయచేసి ఒక విషయాన్ని గమనించండి.నావల్ల నా తల్లి సంపన్నురాలు కాదు.

నేను వ్యాపారవేత్తలు ఉన్న కుటుంబం నుంచి వచ్చాను.మా అమ్మ 25 ఏళ్లకు పైగా టీచర్ గా పని చేసింది.

బాలీవుడ్ అనేది ఓ మాఫియా.ఈ మాఫియా నేను రియాక్ట్ తీరుకి కారణం ఆమెనే.

అందరిలా ముసి ముసి నవ్వులు, ఐటెం సాంగ్స్, పెళ్లిళ్లలో డాన్స్లు, రాత్రిపూట హీరోల గదిలోకి వెళ్లడం వంటి పనులు నేను చేయలేను.చెయ్యను.

అందుకే నాపై పిచ్చిది అని ముద్ర వేసి జైలుకు పంపేందుకు కూడా కుట్రలు చేశారు అని కంగనా రనౌత్ రాసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube