బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిన అగ్నిపథ్ పథకం పై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.కేంద్ర ప్రభుత్వం యువతను ఈ పథకం కింద ఆర్మీ లోకి తీసుకోవాలని వెల్లడించడంతో ఈ పథకం పై కొందరు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీం పై ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించి షాకింగ్ కామెంట్ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకు వచ్చిన ఈ పథకంపై తాను పూర్తిగా మద్దతు తెలుపుతున్నానని తెలిపారు.
ఇలాంటి అద్భుతమైన పథకాన్ని తీసుకు వచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఈ విధమైనటువంటి పథకాన్ని అమలులోకి తీసుకు వచ్చి యువతను ఆర్మీలోకి ఆహ్వానిస్తున్నారని తెలిపారు.
కొన్ని సంవత్సరాల పాటు ఆర్మీ లో ప్రతి ఒక్కరు పనిచేయటం ద్వారా జీవితంలో ఎలా విలువలతో జీవించాలో నేర్చుకుంటారని ఈమె తెలిపారు.ప్రతి ఒక్కరి లోను క్రమశిక్షణ ఏర్పడటమే కాకుండా జాతీయ భావం దేశ సరిహద్దుల్లో ఉంటూ దేశాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుంటారని ఈమె తెలిపారు.

ప్రస్తుతం ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకం ఏదో డబ్బు కోసమో, భవిష్యత్తును నిర్మించుకోవడానికో ఉపాధికల్పనకో కాదని ఈమె తెలిపారు.పూర్వకాలంలో ప్రతి ఒక్కరు గురుకులాలకు వెళ్లే వాళ్లని ఈ అగ్నిపథ్ ఈ పథకం కూడా అలాంటిదేనని ఈమె తెలియజేశారు.కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకో వచ్చిన అగ్నిపథ్ పథకాన్ని గౌరవప్రదమైన గురుకులాలతో పోలుస్తూ ఈమె కామెంట్
.