మెగా మేనల్లుడికి గండం.. ఆ సినిమా ప్లాప్ అయితే వైష్ణవ్ తేజ్ పరిస్థితి ఏంటో!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అనంతరం ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.

 Vaishnav Tej Kethika Sharma Ranga Ranga Vaibhavanga Movie Update Details, Vaish-TeluguStop.com

బాక్సాఫీస్ వద్ద కోట్లలో లాభాలను తెచ్చిపెట్టిన ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే స్టార్ హీరోగా మారిపోయాడు.ఇక ఈ సినిమా అనంతరం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కొండపొలం అనే సినిమా ద్వారా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.

వైష్ణవ్ తేజ్ నటించిన కొండపొలం సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను సందడి చేయలేక బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.

ఇకపోతే తాజాగా ఈయన తన మూడవ చిత్రంగా రంగ రంగ వైభవంగా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.గిరీశాయ దర్శకత్వంలో బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది.ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

Telugu Girishaya, Vaishnavi Tej, Kethika Sharma, Rangaranga, Telugu, Tollywood,

ఇక ఇందులో వైష్ణవి తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కేతికశర్మ సందడి చేయనున్నారు.ఇక ఈ సినిమాలో వీరిద్దరూ మెడికల్ స్టూడెంట్స్ పాత్రలో నటించనున్నారు.ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ మంచి విజయం సాధిస్తేనే ఈయన తన పై ఉన్నటువంటి ఫ్లాప్ గండం నుంచి బయటపడగలరు.ఇక ఈ సినిమా ఫ్లాప్ అయితే తన పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ సినిమా హిట్ అయితేనే ఈయన మార్కెట్ పెరగడమే కాకుండా తదుపరి సినిమా అవకాశాలు వస్తాయి లేదంటే అతనికి కెరియర్ పూర్తిగా ఇబ్బందుల్లో పడుతుందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube