నిహారిక అలాంటి వ్యక్తి.. షాకింగ్ విషయాలను రివీల్ చేసిన సుమంత్ అశ్విన్!

ప్రముఖ టాలీవుడ్ దర్శకనిర్మాతలలో ఒకరైన ఎం.ఎస్.రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.నాన్న నిర్మించిన సినిమాలు ఫ్లాపైన సమయంలో తాను ఎక్కువగా ఆలోచించలేదని సుమంత్ అశ్విన్ చెప్పుకొచ్చారు.

 Sumanth Ashwin Comments About Heroine Niharika Goes Viral Details, Sumanth Ashwi-TeluguStop.com

ఇప్పుడు డబ్బుల గురించి ఎక్కువగా ఆలోచిస్తానని ఆయన వెల్లడించారు.హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఇంట్లో వాతావరణం మారదని ఆయన తెలిపారు.

సుమంత్ అశ్విన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 7 డేస్ 6 నైట్స్ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు.దేవి సినిమా కోసం నాన్న మూడు నుంచి నాలుగు సంవత్సరాల పాటు కష్టపడ్డారని సుమంత్ అశ్విన్ కామెంట్లు చేశారు.

సినిమా సక్సెస్ కాలేదంటే నాన్నకు బాధ ఉంటుందని అయితే ఇంట్లో ఆ ప్రభావం పడకుండా నాన్న జాగ్రత్త పడతారని ఆయన తెలిపారు.

దేవీపుత్రుడు సినిమా ఫ్లాప్ కావడం వల్ల నాన్న లో బడ్జెట్ సినిమాలపై దృష్టి పెట్టారని అలా మనసంతా నువ్వే తక్కువ బడ్జెట్ లో నిర్మించి సక్సెస్ సాధించారని ఆయన తెలిపారు.

Telugu Devi, Happy, Raju Son, Nagababu, Niharika, Raju, Sumanth Ashwin, Sumantha

పౌర్ణమి, ఆట, మస్కా సినిమాలు నిరాశపరిచాయని సుమంత్ అశ్విన్ తెలిపారు.ఏదైనా సినిమాలో నటిస్తానంటే స్క్రిప్ట్ గురించి ఇంట్లో చర్చిస్తామని సుమంత్ అశ్విన్ కామెంట్లు చేయడం గమనార్హం.

Telugu Devi, Happy, Raju Son, Nagababu, Niharika, Raju, Sumanth Ashwin, Sumantha

తాను నిహారిక కలిసి నటించడంతో హ్యాపీ వెడ్డింగ్ సినిమాకు బాగా క్రేజ్ వచ్చిందని సుమంత్ అశ్విన్ తెలిపారు.నిహారిక చాలా మంచి వ్యక్తి అని బాగా నటిస్తుందని నాగబాబు గారు అంటే నాకు చాలా రెస్పెక్ట్ అని సుమంత్ అన్నారు.నిహారిక అందరితో చాలా బాగా మాట్లాడుతుందని ఈగో లేకుండా అందరికీ ఎనర్జీ వచ్చేలా నిహారిక ప్రవర్తన ఉంటుందని సుమంత్ అశ్విన్ వెల్లడించారు.నిహారిక ఒక హోటల్ ను చూపించి అక్కడ దెయ్యాలు ఉంటాయని చెప్పి భయపెట్టిందని ఆయన పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube