పెళ్లికి సిద్ధమైన ప్రభాస్ హీరోయిన్.. పోస్ట్ వైరల్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) హీరోగా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ కంగనా ఏక్ నిరంజన్( Ek Niranjan ) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా తర్వాత ఈమె తెలుగులో ఎలాంటి సినిమాలను నటించలేదు ఈ సినిమా అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయినటువంటి కంగనా అక్కడే సెటిల్ అయిపోయార.అయితే చాలా రోజుల తర్వాత ఈమె చంద్రముఖి 2( Chandra Mukhi ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కానుంది.

ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కంగనా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎన్నో విషయాలను తెలియజేశారు.ఇకపోతే ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలిచే ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని తెలుస్తోంది ఈ క్రమంలోనే ఈమె పెళ్లికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

బాలీవుడ్ లో కాంట్రవర్షియల్ ట్వీట్లు చేస్తూ ఎంతో ఫేమస్ అయిన నటుడు కేఆర్ కే ( KRK ) కంగనా పెళ్లి గురించి తాజాగా చేసినటువంటి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈయన కంగనా పెళ్లి గురించి ట్వీట్ చేస్తూ.త్వరలోనే కంగనా పెళ్లి చేసుకోబోతుందని ఈమె ప్రముఖ బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకోబోతుందని ఈయన వెల్లడించారు.

నిశ్చితార్థం చేసుకోబోతున్నారని వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో వీరి పెళ్లి జరుగుతుంది అంటూ ఈయన చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది.అయితే ఈయన తరచూ ఇలా సెలబ్రిటీల గురించి వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ ఉంటారు.

మరి నిజంగానే కంగనా పెళ్లి చేసుకోబోతుందా లేకపోతే ఇది కూడా ఈయన ఊహగానమైన అనే విషయం తెలియాలి అంటే కంగనా స్పందించాల్సి ఉంది.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు