బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ముంబైలోని తన కార్యాలయాన్ని కూల్చివేసినందుకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తనకు రూ.2 కోట్లను పరిహారంగా చెల్లించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే.అయితే దీని తాలూకు అఫిడవిట్ ను సమర్పించిన బీఎంసీ….ఇలా నష్టపరిహారం కోరడం చట్ట ధిక్కారమేనని తన అఫిడవిట్ లో పేర్కొంది.ఈ మేరకు బాంబే హైకోర్టులో తన సమాధానం తాలూకు అఫిడవిట్ ను సమర్పించిన బీఎంసీ పై వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది.ఆమె వేసిన పిటిషన్ ను కొట్టివేయాలని, ఆమె నుంచి ఖర్చులను రాబట్టాలని అభ్యర్థించింది.
అసలు ఆమె పిటిషన్ విచారణకు నిలువబోదని కూడా తెలిపింది.ఈ నెల 9 న ముంబైలోని కంగనా మణికర్ణికా కార్యాలయాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగింది అని పేర్కొంటూ కార్పొరేషన్ అధికారులు పాక్షికంగా కూల్చివేసిన తెలిసిందే.
అయితే ఒకపక్క కోర్టు లో స్టే కోసం ప్రయత్నిస్తున్న సమయంలో బీఎంసీ అధికారులు తన ఆఫీస్ ను కూల్చడం పై కంగనా మండిపడింది.ఇందుకే ముంబై మరో ఆక్రమిత కాశ్మీర్ లా తయారు అయ్యింది అని వ్యాఖ్యలు చేశాను అంటూ తన వ్యాఖ్యలను సమర్ధించుకుంది.
ఈ క్రమంలోనే స్టే ఆర్డర్ కూడా తీసుకున్న కంగనా బీఎంసీ అధికారులు తన కలలపై, తన భవిష్యత్తుపై ‘అత్యాచారం’ జరిగిందని, తనకు రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలంటూ కోర్టులో సవరణ పిటిషన్ దాఖలు చేసింది.అయితే ఆమె దాఖలు చేసిన పిటీషన్ ను ఈ నెల 22 న కోర్టు విచారణ జరపనుండగా ఇప్పుడు బీఎంసీ అధికారులు పై మేరకు అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.