కాంచన…( Kanchana ) ఇప్పటి తరం ప్రేక్షకులకు ఆమె అర్జున్ రెడ్డి సినిమాలో హీరోకు బామ్మ పాత్ర చేసినట్టుగానే తెలుసు.కానీ ఆమె ఒక సీనియర్ నటి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అనే తేడా లేకుండా వందల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
ఆనాటి స్టార్ హీరోలు అందరితో జోడి కట్టి కాంచన అగ్రనాయకగా దూసుకుపోయింది.కాంచన ఎంతో అందమైన నటి మాత్రమే కాదు మంచు మనసున్న నటి కూడా.
ఆమె ప్రస్తుతం వైధవ్యంలో ఉంది.అయినా కూడా ఇప్పటికీ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తూనే ఉంది.
కాంచన లాంటి ఈ నటిమని ఎన్టీఆర్ అక్కినేని వంటి స్టార్ హీరోల సరసన చాలా సినిమాల్లో నటించింది.అయితే సొంత తల్లిదండ్రులు కాంచన ను విషం పెట్టి చంపాలని అనుకోవడంతో ఆమె అందర్నీ కాదని ఇంటి నుంచి వెళ్లిపోయి ఒంటరిగా జీవిస్తుంది.
తన సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఎన్నో ఆస్తులను కొనుగోలు చేసిన కాంచన తల్లిదండ్రులు చివరికి ఆమెకు చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు.అయితే తల్లిదండ్రులపై కోర్టులో కేసు వేసి అన్ని పోగా కొంతమేర ఆస్తి దక్షించుకోగలిగింది.ఇక ఆస్తి ఉంటే ఎవరైనా తనని ఏదైనా చేస్తారు ఆస్తి మాత్రమే అందరికీ కావాలి.అందుకే అలాంటి పాపిష్టి ఆస్తి తనకు వద్దని గుడికి మొత్తం రాసి ఇచ్చేసింది.
ప్రస్తుతం అదే గుడిలో దైవ సేవ చేస్తూ బ్రతుకుతోంది.అలాగే సినిమాల్లో నటిస్తున్న డబ్బుతో కాలం వెల్లదిస్తోంది.
పలు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంతో ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా చేయబడుతుంది.తనకు వచ్చేది పది రూపాయలైనా సరే సామాజిక సేవ చేస్తూ 10 మంది చల్లగా ఉండేలా చూడాలని ఆరాటపడుతూ ఉంటుంది కాంచనమ్మ.
అయితే ఇటీవల ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంచన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజమౌళి ( Rajamouli ) ఇతను బాహుబలి సినిమా( Bahubali ) కోసం రెండు రోజుల డేట్స్ అడిగాడని, కానీ తాను ఐదు లక్షల అడగడంతో ఆ పాత్రకు అంతగా ఇవ్వలేమని తనను వద్దు అని అనుకున్నారు అని తెలిపారు కాంచన.తన లాంటి ఒక సీనియర్ నటికీ ఐదు లక్షలు ఇవ్వలేని స్థితిలో రాజమౌళి లేడు కదా ? ఐదు లక్షలు వారికి పెద్ద విషయమే కాదు కదా ? నాలాంటి నటికీ ఇస్తే ఎంతో మందికి ఉపయోగపడుతుంది.ఎందుకు ఇవ్వలేదు అంటూ రాజమౌళి ని కడిగేశారు కాంచన.మరి ఇంటర్వ్యూ తర్వాత తన ఆవేదన రాజమౌళి వరకు చేరుతుందా లేదా వేచి చూడాలి.