ఛాన్స్ ఇవ్వండి సత్తా చూపిస్తాం ! కాంగ్రెస్ కు 'కమ్మ ' నేతల డిమాండ్ 

తెలంగాణలో కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా ఒక కొలిక్కి వచ్చిందనుకుంటున్న సమయంలో కొత్త కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.ఇప్పటికే తమకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ వినిపిస్తుండగానే , మరోవైపు కమ్మ సామాజిక వర్గం నేతలు( Kamma Leaders ) అదే తరహాలో డిమాండ్లు వినిపిస్తుండడం కాంగ్రెస్ కు( Congress ) తలనొప్పిగా మారింది.

 Kamma Leaders Led By Renuka Chowdary Met Kc Venugopal Details, Telangana Congres-TeluguStop.com

రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా కావడంతో , అన్ని వర్గాలకు దగ్గర అయ్యి,  ఎన్నికల్లో గెలవాలనే ప్లాన్ తో ఉంది.ఈ సమయంలోనే సామాజిక వర్గాల వారీగా టికెట్లు కేటాయింపులు,  ప్రాధాన్యం కోరుతూ అల్టిమేట్ ఇస్తూ ఉండడం ఇబ్బందికరంగా మారింది.

తాజాగా కాంగ్రెస్ లోని కమ్మ సామాజిక వర్గం నేతలు తమకు పది నుంచి 12 అసెంబ్లీ స్థానాలను కేటాయించాలనే డిమాండ్ వినిపిస్తున్నారు.ఈ మేరకు మాజీ కేంద్రమంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత రేణుక చౌదరి( Renuka Chowdary ) ఆధ్వర్యంలో కమ్మ సామాజిక వర్గం నేతలు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తో( KC Venugopal ) భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా తెలంగాణలో 30 నియోజకవర్గాల్లో గెలుపోవటములను ప్రభావితం చేసే సత్తా తమ సామాజిక వర్గానికి ఉందని,  మరో 10 నియోజకవర్గాల్లోనూ తమ సామాజిక వర్గం బలంగా ఉందని కమ్మ సామాజిక వర్గం నేతలు కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారట.గత ఎన్నికల్లోను తమ సామాజిక వర్గానికి పెద్దగా ప్రాధాన్యం దక్కలేదని , ఈసారైనా తప్పకుండా తమకు సీట్లు కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు.

Telugu Aicc, Congressmla, Kamma, Kc Venugopal, Renuka Chowdary, Revanth Reddy, T

ముఖ్యంగా శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఖమ్మం, మల్కాజ్ గిరి , కొత్తగూడెం , జూబ్లీహిల్స్,  కోదాడ,  పాలేరు,  ఉప్పల్,  రాజేంద్రనగర్,  కూకట్ పల్లి, పఠాన్ చెరువు, బాన్సువాడ , బోధన్ నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉందని,  అలాగే పినపాక,  సత్తుపల్లి,  మధిర , అశ్వరావుపేట , ఇల్లందు,  వైరా , భద్రాచలం , ములుగు రిజర్వ్ స్థానాల్లోనూ తమ సామాజిక వర్గం బలంగా ఉందని , జనరల్ స్థానాలైన నాగార్జునసాగర్,  మిర్యాలగూడ , హుజూర్ నగర్,  సూర్యాపేట,  ఖైరతాబాద్,  సనత్ నగర్ , మేడ్చల్ లో గెలుపోవటములను ప్రభావితం చేసే స్థాయిలో తమ సామాజిక వర్గం ఉందని , వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని తమ సామాజిక వర్గం కు సీట్ల కేటాయించాలని కోరారట.

Telugu Aicc, Congressmla, Kamma, Kc Venugopal, Renuka Chowdary, Revanth Reddy, T

కమ్మ సామాజిక వర్గం నేతల డిమాండ్లపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) స్పందించారు .టికెట్ల కేటాయింపులో సముచిత స్థానం కల్పించాలని , వివిధ సామాజిక వర్గాల నేతలు కోరుతున్నారని,  కమ్మ నేతలు రిప్రజెంటేషన్ విషయం గురించి తమ పార్టీ పెద్దలు తనకు చెప్పారని , అందరి విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని, టిక్కెట్లు కేటాయిస్తామని, టిక్కెట్లు దక్కని వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని రేవంత్ హామీ ఇచ్చారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube