హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద సెకండ్ ఏఎన్ఎంల ఆందోళన

హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద సెకండ్ ఏఎన్ఎం ఆందోళన ఉద్రిక్తంగా మారింది.తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఛలో సెక్రటేరియట్ పేరుతో నిరసనకు దిగారు.

 Agitation Of Second Anms At Hyderabad Indira Park-TeluguStop.com

ఈ నిరసన కార్యక్రమానికి అనుమతి లేకపోవడంతో పోలీసులు సెకండ్ ఏఎన్ఎం సభ్యులను అడ్డుకున్నారు.ఈ క్రమంలోనే ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

దీంతో ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.సెకండ్ ఏఎన్ఎంలను క్రమబద్ధీకరించాలని, వయో పరిమితి సడలించడంతో పాటు తమ పెండింగ్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని స్టేషన్ కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube