వెట్రిమారన్ దర్శకత్వంలో వంద కోట్లతో కమల్ పాన్ ఇండియా మూవీ

తమిళంలో జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్న చిత్రాల దర్శకుడుగా వెట్రి మారన్ కి మంచి పేరు ఉంది.

సమాజంలో అణచివేతకి గురవుతున్న వర్గాలలో ఆవేశాన్ని తెరపై ఆవిష్కరించే దర్శకుడుగా వెట్రి మారన్ కి మంచి పేరు ఉంది.

అతని సినిమాలలో ఎక్కువగా భావోద్వేగాలు ఉంటాయి.వెనుకబడిన వర్గాల ఆవేదన, వారిని ఏ విధంగా సమాజం నిర్లక్ష్యం చేస్తుంది, నేరస్తులుగా చూపించే ప్రయత్నం చేస్తుంది అనే అంశాలని అతని సినిమాలతో తెరపై ప్రెజెంట్ చేస్తూ ఉంటారు.

ఈ కారణంగానే జాతీయ్థాంశయిలో వెట్రి మారన్ సినిమాలు అవార్డులు సొంతం చేసుకున్నాయి.ధనుష్, వెట్రి మారన్ కాంబోలో వచ్చిన అసురన్ మూవీ తెలుగులో నారప్ప టైటిల్ తో రీమేక్ అవుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ దర్శకుడు నెక్స్ట్ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తుంది.లోకనాయకుడు కమల్ హాసన్ వెట్రి మారన్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు తెలుస్తుంది.

Advertisement

ప్రస్తుతం కమల్ హసన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే మూవీలో నటిస్తున్నాడు.ఈ సినిమా తర్వాత వెట్రి మారన్ దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నాడు.

ఇక ఈ మూవీ వంద కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఈ కాంబినేషన్ లో అది కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమా అంటే కచ్చితంగా వెట్రి మారన్ ఇంకేదో కంట్రవర్షియల్ ఎలిమెంట్ ని కమల్ హాసన్ ద్వారా యూనివర్శల్ స్టాండర్డ్స్ లో చెప్పబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.మరి అది ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్ వచ్చే వరకు ఎదురుచూడాలి.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు