కమల్ - మణిరత్నం ప్రాజెక్ట్ లో ఆ స్టార్స్ కూడా.. మరో క్రేజీ కాంబో సెట్!

విశ్వనాయకుడు కమల్ హాసన్ ‘విక్రమ్( Vikram movie )’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.ఎన్నో ఏళ్ల తర్వాత కమల్ హాసన్ విక్రమ్ తో అలాంటి హిట్ కొట్టడంతో ఈయన మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

 Kamal Haasan - Mani Ratnam Reunite On , Kh234, Kh234, Kamal Haasan, Mani Ratnam-TeluguStop.com

ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో కమల్ హాసన్ ఎప్పుడో ఆగిపోయిన సినిమాను కూడా మళ్ళీ రీ స్టార్ట్ చేసాడు.కమల్ హాసన్ ప్రెజెంట్ ”ఇండియన్ 2” సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

ఇక దీంతో పాటు కమల్ హాసన్ టాలీవుడ్ లో ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు.పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ”కల్కి 2898 ఏడి”లో కీలక రోల్ లో నటిస్తున్నాడు.

Telugu Dulquer Salmaan, Indian, Kamal Haasan, Kamalhaasan, Kh, Mani Ratnam, Ponn

ఇక ఈ సినిమా తర్వాత కమల్ ( Kamal Haasan )లైనప్ లో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఉన్నారు. కమల్ హాసన్ కెరీర్ లో 234వ సినిమా ఈ కాంబో లోనే తెరకెక్కనుంది.ఇటీవలే మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాతో( Ponniyin Selvan ) సక్సెస్ అందుకుని మంచి ఫామ్ లోకి వచ్చారు.ఇక ఈ సినిమాను అతి త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు.కాగా ఈ సినిమా సహ నిర్మాతలలో కమల్ కూడా ఉన్నారు…

Telugu Dulquer Salmaan, Indian, Kamal Haasan, Kamalhaasan, Kh, Mani Ratnam, Ponn

ఇదిలా ఉండగా ఈ సినిమాలో మిగిలిన కాస్ట్ గురించి ఇంత వరకు మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ లో పెట్టారు.కానీ తాజాగా ఒక మేకప్ ఆర్టిస్ట్ చేసిన పోస్ట్ తో ఈ సినిమాలో భారీ కాస్ట్ ఉండబోతుంది అనేది తెలుస్తుంది.ఈ సినిమా కోసం రంజిత్ అంబాడి ప్రసాద్ మేకప్ ఆర్టిస్టుగా పని చేయనున్నారు.ఇతడు తాజాగా ఒక పోస్ట్ చేసాడు .ఈ పోస్టుకు జయం రవి, దుల్కర్ సల్మాన్, త్రిష లను ట్యాగ్ చేసారు.అలాగే కమల్, మణిరత్నం, ఏఆర్ రెహమాన్ లను కూడా ట్యాగ్ చేసారు.

దీంతో భారీ క్యాస్ట్ ఈ సినిమాలో ఖరారు అయినట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube