కరోనా ఎఫెక్ట్: ఆ గుడికి రూ.6 కోట్లు నష్టం..!

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారు.

కరోనా నియంత్రణ కోసం లాక్ డౌన్ అమలు చెయ్యడంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఉద్యోగాలు పోయి రోడ్డు మీద పడ్డారు.

మిడిల్ క్లాస్ ప్రజలు, వ్యాపారవేత్తలు ఆర్ధికంగా దారుణంగా నష్టపోయారు.కాగా కరోనా లాక్ డౌన్ కారణంగా బడులు, కార్యాలయాలు, ఆలయాలు అన్ని మూసేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా అస్సాంలోని చారిత్రాత్మ‌క‌మైన కామాఖ్యా ఆలయం కూడా మూసివేశారు.మార్చి నెల 18వ తేదీ నుంచి ఆలయంలో ఏ భక్తులను అనుమతించడం లేదు.

కేవలం పూజారులు మాత్రమే ఆలయంలోకి వెళ్లి పూజలు చేస్తున్నారు.ఆలయానికి భక్తుల రాకను నిలిపివేయడంతో లాక్ డౌన్ కాలంలో 6 కోట్ల రూపాయిల నష్టం సంభవించింది.

Advertisement

ఈ విషయాన్నీ ఆలయ కమిటీనే వెల్లడించింది.సాధారణంగా ఈ ఆలయానికి రోజుకు 20 వేల నుంచి 30 వేలమంది భక్తులు వచ్చేవారని దాని వల్ల వారికి రూ.1.5 ల‌క్ష‌ల ఆదాయం వ‌చ్చేదని తెలిపారు.గత 5 నెలల నుంచి ఒక్క భక్తుడిని కూడా అనుమతించలేదని అయినప్పటికి ప్రతి రోజు పూజా కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్న‌ట్లు ఆలయ ప్రధాన అర్చకుడు తెలిపారు.

ఈ గుడిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న పలువురికి తీవ్ర నష్టం వచ్చిందని, ఆ ఆలయంలో పని చేసే సిబ్బందికి ప్రతి నెల జీతాలను చెల్లిస్తున్నట్టు ఆలయ పూజారి స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు