పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో కోవిడ్ విజృంభణ..!

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.చంద్రగిరి కల్యాణి డ్యాం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో కరోనా విజృంభిస్తోంది.

కాలేజీలో శిక్షణ పొందుతున్న 348 ట్రైనీలతో పాటు సిబ్బందికి, మరో 50 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.శుక్రవారం వచ్చిన టెస్టుల రిపోర్టుల్లో 40 మందికి పాజిటివ్ రాగా, ఈ రోజు(శనివారం) 33 మందికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్లు నిర్ధారించారు.

మరికొందరికి ఫలితాలు రావాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు.కోవిడ్ వైరస్ సోకిన టైనీ పోలీసులను కోవిడ్ కేర్ సెంటర్ కు అధికారులు తరలించి చికిత్స అందిస్తున్నారు.

అనంతరం ట్రైనింగ్ కళాశాల మొత్తాన్ని అధికారులు శానిటైజేషన్ నిర్వహించారు.కాగా, ట్రైనింగ్ తీసుకుంటున్న విశాఖ, కర్నూలు, విజయనగరం, కడప, నెల్లూరు, అనంతరపురం, ప్రకాశం జిల్లాల్లోని వీరి కుటుంబ సభ్యులు భయాందోళను గురయ్యారు.

Advertisement

పోలీస్ ట్రైనింగ్ లో ఉన్న వారికి కోవిడ్ ఎలా సోకిందని ప్రశ్నిస్తున్నారు.కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శిక్షణ కళాశాలను మూసివేసే ఆలోచనలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కాగా, ఈ వైరస్ శిక్షణ పొందుతున్న ట్రైనీలందరికీ కరోనా వచ్చే ఛాన్స్ అధికంగా ఉందన్నారు.దీంతో పోలీసులు ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుని కరోనా నియంత్రించేలా చర్యలు తీసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు