Kalyani Surya Kiran : అందుకే నువు భేష్ కళ్యాణి.. సూర్య కిరణ్ మరణం తర్వాత మారిన పరిస్థితి

ప్రముఖ యాక్టర్, డైరెక్టర్ సూర్యకిరణ్( Surya Kiran ) 50 ఏళ్ల వయసులో అకాల మరణం చెందారు.అంత చిన్న వయసులో ఆయన చనిపోవడం సినీ ప్రపంచం జీర్ణించుకోలేకపోయింది.

 Kalyani Behvaiour After Surya Kiran Death-TeluguStop.com

అయితే ఈ దర్శకుడి మరణాన్ని కూడా డబ్బుల కోణంలో చూస్తూ కొంతమంది పైసలు సంపాదించేందుకు దిగజారుడుగా ప్రవర్తిస్తున్నారు.ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు సూర్య కిరణ్ తన ప్రేమ పెళ్లి చెడిపోయిన తర్వాతే డిప్రెషన్‌కి లోనయ్యాడని, హీరోయిన్ కల్యాణి( Heroine Kalyani ) వల్లే చచ్చిపోయాడని కథలు వడ్డిస్తున్నారు.

సూర్యకిరణ్ కు సుజిత( Sujitha ) అనే ఒక సొంత చెల్లి ఉంది.ఆమె బాలనటిగా, టీవీ స్టార్‌గా, సినిమా నటిగా బాగా పాపులర్ కూడా అయింది.

నిజం చెప్పాలంటే సూర్య కిరణ్ తో పాటు సుజిత కూడా మలయాళ, తమిళ, తెలుగు ప్రేక్షకులలో పాపులర్ అయింది.అయితే సూర్యకిరణ్ చనిపోయాక సుజిత కొన్ని ఎమోషన్ కామెంట్స్ చేసింది.

సూర్య కిరణ్ మూవీ ప్రొడక్షన్‌లో( Movie Production ) అడుగుపెట్టడం వల్ల బాగా అప్పులయ్యాయని, చాలా డబ్బు నష్టపోయి డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు అని తెలిపింది.ప్రేమపెళ్లి కూడా విడాకుల దాకా వెళ్లిపోయిందని వెల్లడించింది.

Telugu Surya Kiran, Kalyani, Sujitha, Suryakiran, Tollywood-Movie

ఆమె ఆ మాటలు మాట్లాడిన తర్వాత నుంచి కబడ్డీ కబడ్డీ హీరోయిన్ కావేరి అలియాస్ కల్యాణికి సూర్య కిరణ్‌ మరణంతో ముడిపెడుతూ కథనాలు రాయడం ప్రారంభించారు.నిజం చెప్పాలంటే కల్యాణిని సూర్య కిరణ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.తర్వాత విడాకులు అయ్యాయి.అయితే సుజిత కల్యాణిని నిందించినట్లు ఎక్కడా అనిపించలేదు.అయినా యూట్యూబర్లు కల్యాణి గురించి సుజిత నెగిటివ్‌గా మాట్లాడినట్లు రాస్తున్నారు.

Telugu Surya Kiran, Kalyani, Sujitha, Suryakiran, Tollywood-Movie

అయితే దీని పై క్లారిటీ ఇస్తూ ఒకరిని తిడితే తనకి ఏమి వస్తుందని, జీవితం అనేది చిన్న ప్రయాణం ప్రతిక్షణాన్ని ఆనందంగానే గడుపుదాం అన్నట్లు సుజిత ఒక వీడియోని రిలీజ్ చేసింది.ఈ వీడియోను కూడా యూట్యూబర్లు వేరే రకంగా అర్థం చేసుకున్నారు.కల్యాణిని తిడితే తనకు ఏమి వస్తుంది అని ఆమెను సుజిత తిట్టకుండా వదిలేసిందంటూ వీడియోలు చేయడం మొదలుపెట్టారు.

అయితే ఇంత జరుగుతున్నా కల్యాణి మాత్రం కామ్ గా ఉండిపోయింది.బయటికి కూడా రాలేదు.సూర్య కిరణ్ అంత్యక్రియలకు హాజరైందో లేదో తెలియలేదు.కానీ రూమర్ల విషయంలో ఆమె హుందాగా ప్రవర్తించింది.

ఈ కారణంగా ఫ్యాన్స్ ఆమెను పొగుడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube