కొన్ని సినిమాలు చిన్న సినిమాలుగా విడుదలై భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుంటాయి.అలా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసిన సినిమాలలో కాంతార2 సినిమా కూడా ఒకటి.కాంతార1( Kantara 1 ) సక్సెస్ సాధించడంతో కాంతార2 కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా రుక్మిణీ వసంత్( Rukmini Vasanth ) నటిస్తారని సమాచారం అందుతోంది.మొదట కాంతార2 సినిమా 2025 సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానుందని ప్రచారం జరగగా ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 2025 సంవత్సరం సమ్మర్ కానుకగా విడుదల కానుంది.కాంతార2 టైటిల్ తో తెరకెక్కుతున్నా ఈ సినిమా కాంతార ప్రీక్వెల్ కావడం గమనార్హం.ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటి ఊర్వశీ రౌతేలా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది.

తొలి భాగం ఎక్కడైతే మొదలైందో అంతకు ముందు కథను ఈ సినిమాలో చూపించనున్నారు.ఈ సినిమా కోసం రిషబ్ శెట్టి గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారని తెలుస్తోంది.సమ్మర్ కానుకగా సినిమాను విడుదల చేస్తే ఎక్కువ సెలవులను ఈ సినిమా ఉపయోగించుకోనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
కాంతార 2( Kantara 2 ) ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతోందని తెలుస్తోంది.బడ్జెట్ విషయంలో లిమిట్స్ లేకపోవడంతో కాంతార2 సినిమాను ఒకింత భారీ స్థాయిలో తీస్తున్నారు.
ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా అన్ని భాషల్లో ఒకే సమయంలో విడుదల చేయనున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) కాంతార2 సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కాంతార2 కథ, కథనంలో ఆసక్తికర ట్విస్టులు ఉంటాయని ఆ ట్విస్టులు ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కాంతార2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఈ సినిమా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా కాంతార2 సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉంది.







