కళ్యాణ్‌ పడ్డ కష్టం మళ్లీ వృధానే... కలెక్షన్స్‌ నిరాశే

నందమూరి హీరో కళ్యాణ్‌ రామ్‌ తన ప్రతి సినిమాకు చాలానే కష్టపడుతున్నాడు.అయినా కూడా అతడు సరైన ఫలితాన్ని అందుకోలేక పోతున్నాడు.

తాజాగా గుహన్‌ దర్శకత్వంలో చేసిన 118 చిత్రం కోసం కూడా కళ్యాణ్‌ రామ్‌ చాలానే కష్టపడ్డాడు.విభిన్నమైన నేపథ్యంలో యాక్షన్‌ సన్నివేశాలు, ఆకట్టుకునే ఎమోషన్స్‌తో కళ్యాణ్‌ రామ్‌ మెప్పించాడు.

అయితే సినిమాలో ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌ స్క్రీన్‌ప్లే ఉండి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.పాజిటివ్‌గా టాక్‌ వచ్చినా కూడా కలెక్షన్స్‌ను రాబట్టగల సత్తా ఈ చిత్రానికి లేదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం కళ్యాణ్‌ రామ్‌ ఈ చిత్రం కథపై చాలా నమ్మకం పెట్టుకుని నటించాడు.కళ్యాణ్‌ రామ్‌ ఈ కథను ఎన్టీఆర్‌తో తీయాలని కూడా భావించాడు.

Advertisement

కాని తానే చేయాల్సి వచ్చింది.గుహన్‌ ఈ చిత్రాన్ని చాలా బాగా తీస్తున్నాడు అంటూ మొదటి నుండి చెబుతూ వచ్చాడు.

అన్నట్లుగానే సినిమాను బాగానే తీశారు, కాని కలెక్షన్స్‌ వచ్చేలా మాత్రం తీయలేదు.అంటే సినిమా ఒక వర్గం వారికి ఆసక్తికరంగా సాగింది.

అయితే సినిమా అనేది ఒక్క వర్గం వారిని మాత్రమే ఆకట్టుకుంటే డబ్బులు రావు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటనే వసూళ్లు నమోదు అవుతాయి.

ఈ చిత్రం మొదటి రోజు కేవలం 1.38 కోట్లు మాత్రమే వసూళ్లు చేసింది.రెండవ రోజు కోటికి లోపే షేర్‌ను రాబట్టింది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...

ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కలిపి దాదాపుగా 10 కోట్లకు అమ్ముడు పోయింది.దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నైజాం ఏరియాకు గాను కొనుగోలు చేశాడు.

Advertisement

సినిమాపై నమ్మకంతో ఆయన భారీగా మొత్తం పెట్టి కొనుగోలు చేశాడు.ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దారుణంగా కలెక్షన్స్‌ నమోదు అయ్యి, దిల్‌రాజుకు నష్టం మిగిల్చేలా ఉందని తెలుస్తోంది.118 చిత్రం ఫైనల్‌గా 5 కోట్లు అయినా రాబడుతుందా అనేది చూడాలి.

తాజా వార్తలు