రొమాంటిక్ కథలంటే ఫైర్ అవుతున్న నందమూరి హీరో!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ సినిమా బింబిసార. ఈ నందమూరి హీరో చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు రావడంతో ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

 Kalyan Ram Talk About Romantic Movies, Kalyan Ram, Bimbisara, Nandamuri Hero, Ro-TeluguStop.com

మేకర్స్ ఈ సినిమాపై హైప్ పెంచడంతో సఫలం అయ్యారనే చెప్పాలి.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్త మీనన్, క్యాథరిన్ త్రెసా, వరీన హుస్సేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకులు ఎలాంటి రివ్యూ ఇస్తారో చూడాలి.

ఇది ఇలా ఉండగా తాజాగా కళ్యాణ్ రామ్ తనకు ఎలాంటి కథలు సెట్ కావో చెప్పేసాడు.

ఇలా చెప్పడానికి అందరి హీరోలు ముందుకు రారు.కానీ కళ్యాణ్ రామ్ మాత్రం తనకు ప్రేమ కథలు సెట్ కావని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు.

అందుకు ఆయనకు ఇప్పటికే అనుభవం ఎదురైందట.ఇప్పటి వరకు రామ్ చేసిన ప్రేమ కథలు హిట్ అయినా దాఖలాలు లేవు.

Telugu Bimbisara, Kalyan Ram, Kalyanram, Nandamuri, Romantic, Tollywood-Movie

అందుకే ఇకపై రొమాంటిక్ కథల జోలికి వెళ్లనని తేల్చి చెప్పేస్తున్నాడు కళ్యాణ్ రామ్.ఈయన కాస్త రఫ్ లుక్ లో ఉండడం వల్ల ప్రేమ కథలు సెట్ అవ్వవు.అందుకే ఈయన చేసిన తొలిచూపులోనే, అభిమన్యు వంటి రొమాంటిక్ లవ్ స్టోరీలు ఘోరంగా విఫలం అయ్యాయి.అందుకే కళ్యాణ్ రామ్ ప్రేమ కథలు అంటే భయపడిపోతున్నాడు.మరి బింబిసార అయినా ఈయనకు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube