టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం బింబిసారా. ఈ సినిమాకు మళ్లీ డివశిష్ట దర్శకత్వం వహించారు.
కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.టైం ట్రావెల్ అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించిన విషయం తెలిసిందే.ఇక ఇందులో కళ్యాణ్ రామ్ కి జోడిగా కేథరిన్ తెరిసా,అలాగే సంయుక్త హీరోయిన్ లుగా నటించారు.
ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.మరి తాజాగా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
కథ:
క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల క్రితం త్రిగర్తల సామ్రాజ్య అధినేత బిందుసారుడి పాత్రలో కళ్యాణ్ రామ్ నటించారు.టైం ట్రావెల్ పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు.ఇక ఈ సినిమా కథ మొత్తం బింబిసారుడి కాలం నుండి కలియుగంలోకి వచ్చి సంపాదించిన నిధిని ఏ విధంగా కాపాడుకుంటాడు అన్న విషయం చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది.
నటీనటులు నటన :
సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు పాత్రలలో కూడా అద్భుతంగా నటించాడు.అలాగే ఇందులో విశ్వా నందన్ వర్మ పాత్ర ప్రత్యేకంగా నిలుస్తుంది.అదేవిధంగా హీరోయిన్లు సంయుక్త మీనన్ కేథరిన్ తెరిసా లు వారి వారి పాత్రలో ఒదిగిపోయారు.అందంతో కూడా బాగానే ఆకట్టుకున్నారు.బాగానే నటించారు అని చెప్పవచ్చు.

టెక్నికల్:
సినిమాలో ఫస్ట్ ఆఫ్ కాస్త స్లోగా అనిపించినప్పటికీ గ్రాఫిక్స్ మాత్రం అద్భుతంగా కనిపించింది.సెకండాఫ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.మరి ముఖ్యంగా సినిమాలో గ్రాఫిక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.

విశ్లేషణ:
ఈ సినిమా గ్రాండియర్ గా ఉంది.సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఆడియన్స్ ని మెప్పించే ప్రయత్నం చేశారు.కళ్యాణ్ రామ్ చక్కటి నటనతో మరికొన్ని ట్విస్టులతో నిమగ్నం అవడం వల్ల ఇందులో కొన్ని లోపాలు ఉన్నట్లుగా కనిపించవు.ఇక ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు సినిమా ప్రేక్షకులను బాగానే కట్టుకుంటుంది.

ప్లస్ పాయింట్స్:
కళ్యాణ్ రామ్,విజువల్స్, బ్యాక్ గ్రౌండ్,నటన.
మైనస్ పాయింట్స్:
సంగీతం, లాజిక్స్.







