నష్టాల్లో కళ్యాణ్ రామ్

పటాస్ లాంటి భారి హిట్ ఖాతాలో వేసుకొని, కిక్-2 లాంటి క్రేజీ ప్రాజెక్ట్ నిర్మించినప్పటికీ కళ్యాణ్ రామ్ నష్టాల్ల్లోంచి బయటకి రాలేకపోయాడు.కిక్-2 పెట్టిన బడ్జెట్ కి తగ్గ బిజినేజ్ చేయలేదు.

దీని ద్వారా 3.4 కోట్ల నష్టం వాటిల్లింది.కారణాలు ఏవైనా కిక్-2 అనుకున్నంతగా బయర్స్ ని ఆకట్టుకోలేకపోయింది.ఇది పక్కనపెడితే ఇంతకూ ముందే 3.6 కోట్ల నష్టంలో ఉన్నారు కళ్యాణ్ రామ్.ప్రతిష్టాత్మకంగా నిర్మించిన "ఓం" భారి నష్టాల్ని మూటగట్టుకోవడమే దీనికి కారణం.

దాని వాళ్ళ ఎంత నష్టపోయరంటే, పటాస్ భారి వసూళ్ళు కుడా కాపాడలేకపోయాయి.ఇప్పుడు మొత్తానికి 7 కోట్ల నష్టాల్లో ఉంది ఎన్టీఆర్ ఆర్ట్స్.

అభిరుచి గల నిర్మాతగా పేరున్న కళ్యాణ్ రామ్ ఎప్పుడు విమర్శకు నోచుకోలేదు.ఆడని సినిమాలు కుడా ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ఇప్పుడు కిక్-2 చాలా పెద్ద హిట్ అవడం ఎన్టీఆర్ ఆర్ట్స్ కి అత్యవసరం.

Advertisement
ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు

తాజా వార్తలు