బింబిసారా సినిమాను తాత ఎన్టీఆర్‌కి అంకితం: కళ్యాణ్ రామ్

చాలా సంవత్సరాల తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం బింబిసారా.ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 Kalyan Ram Dedicate Bimbisara Movie To Senior Ntr Bimbisara Movie, Kalyan Ram, T-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం శుక్రవారం సాయంత్రం శిల్పకళా వేదికలో ఫ్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ ఫ్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ బింబిసారా సినిమా చూసిన తర్వాత నందమూరి అభిమానులు కాలర్ ఎగరేస్తారు అంటూ కామెంట్స్ చేశారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తన తాతయ్య ఎన్టీఆర్ వందవ జయంతి సందర్భంగా ఈ సినిమాను తన తాతయ్యకు అంకితం చేస్తున్నానంటూ కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.ఇకపోతే ఈ సినిమా విషయంలో అభిమానులను ఏమాత్రం నిరాశపరచినని వందకు రెండు వందల శాతం అభిమానులు అందరూ సంతృప్తి చెందుతారు అంటూ కళ్యాణ్ రామ్ ఈ సినిమా విషయంలో ఎంతో కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు.

Telugu Bimbisara, Kalyan Ram, Senior Ntr, Tollywood-Movie

మనందరికీ చందమామ కథలు, జానపద కథలు అంటే అందరికీ ఇష్టమే ఇలాంటి కథలను తన తాత ఎన్టీఆర్ మొదలు పెట్టారని అలాగే బాబాయ్ బైరవద్వీపం మెగాస్టార్ జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సినిమాల ద్వారా మన ముందుకు వచ్చారని అలాగే బింబిసార సినిమాను కూడా మీ ముందుకు తీసుకు వస్తున్నామని ఈయన వెల్లడించారు.ఈ సినిమా తప్పకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని,ఈ సినిమా కోసం ఎంతగానో కృషి చేసిన దర్శక నిర్మాతలు టెక్నీషియన్లకు కళ్యాణ్ రామ్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube