ఫస్ట్ వీకెండ్ లో బింబిసార బ్రేక్ ఈవెన్.. స్టార్ హీరోలు సైతం షాకయ్యేలా?

కళ్యాణ్ రామ్ హీరోగా మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన బింబిసార బింబిసార సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే దాదాపుగా బ్రేక్ ఈవెన్ అయింది.ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా సాధించిన కలెక్షన్లు 16 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉన్నాయని సమాచారం అందుతోంది.

 Kalyan Ram Bimbisara Movie Break Even In First Weekend Details Here Kalyan Ram , Bimbisara ,break Even, Samyuktha Menon, Catherine Tresa, Tollywood-TeluguStop.com

ఈ మధ్య కాలంలో ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందిస్తున్న సినిమా బింబిసార మాత్రమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గతంలో కొన్ని చిన్న సినిమాలు ఫస్ట్ వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ అయినా ఈ రేంజ్ టార్గెట్ తో బ్రేక్ ఈవెన్ అయిన సినిమా బింబిసార మాత్రమే కావడం గమనార్హం.

బింబిసార సక్సెస్ తో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో మిడిల్ రేంజ్ హీరోలలో తన స్థానాన్ని మెరుగుపరచుకుంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Kalyan Ram Bimbisara Movie Break Even In First Weekend Details Here Kalyan Ram , Bimbisara ,break Even, Samyuktha Menon, Catherine Tresa, Tollywood-ఫస్ట్ వీకెండ్ లో బింబిసార బ్రేక్ ఈవెన్.. స్టార్ హీరోలు సైతం షాకయ్యేలా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గత నెలలో విడుదలైన చాలా సినిమాలతో పోల్చి చూస్తే కళ్యాణ్ రామ్ సినిమా మరింత మెరుగైన కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం.కళ్యాణ్ రామ్ ఈ సినిమా రిజల్ట్ విషయంలో సంతృప్తితో ఉన్నారు.

తన తర్వాత సినిమాలు కూడా భారీగా కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉందని కళ్యాణ్ రామ్ భావిస్తున్నారు.

Telugu Bimbisara, Break, Catherine Tresa, Kalyan Ram, Samyuktha Menon, Tollywood-Movie

బింబిసార సినిమాతో నిర్మాతగా కూడా కళ్యాణ్ రామ్ కు మంచి లాభాలు దక్కే ఛాన్స్ అయితే ఉంది.కళ్యాణ్ రామ్ తర్వాత ప్రాజెక్ట్ బింబిసార2 కాగా వేగంగా షూట్ ను పూర్తి చేసి వచ్చే ఏడాది బింబిసార2 సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండటం బింబిసార సినిమాకు ప్లస్ అయింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube