చిరంజీవి చిన్నల్లుడు కండోమ్‌ ఫ్యాక్టరీ

చిరంజీవి చిన్న కూతురు శ్రీను వివాహం చేసుకున్న కళ్యాణ్‌ దేవ్‌ హీరోగా విజేత అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా ఆశించారు.

సినిమా విజయం సాధిస్తే కళ్యాణ్‌ దేవ్‌ మెగా హీరోగా సెటిల్‌ అయ్యి స్టార్‌ అవ్వాలనుకున్నాడు.కాని పరిస్థితి తారు మారు అయ్యింది.

సినిమా ఫలితం బెడిసి కొట్టింది.విజేత కాస్త లూజర్‌ అయ్యాడు.

అట్టర్‌ ఫ్లాప్‌ మూవీ పడ్డ కారణంగా కళ్యాణ్‌ దేవ్‌ తర్వాత సినిమాకు గ్యాప్‌ తీసుకున్నాడు.

Advertisement

రెండవ సినిమా ప్రారంభించినా కూడా కొన్ని కారణాల వల్ల దాన్ని క్యాన్సిల్‌ చేశారు.కళ్యాణ్‌ దేవ్‌ తన రెండవ సినిమాకు ఇప్పుడు రెడీ అయ్యాడు.దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తీసుకున్న కళ్యాణ్‌ దేవ్‌, పులివాసు అనే దర్శకుడి దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ను పులివాసు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఎన్నో చిత్రాలకు సహాయ దర్శకుడిగా చేసిన పులి వాసు ఈ చిత్రం కోసం విచిత్రమైన టైటిల్‌ కండోమ్‌ ఫ్యాక్టరీని పెట్టాలనుకుంటున్నాడు.

కండోమ్‌ ఫ్యాక్టరీ అని పెట్టడం వల్ల మంచి పబ్లిసిటీ అయితే లభిస్తుంది.కాని మెగా హీరో కనుక అలాంటి టైటిల్‌ విషయంలో చిరంజీవి మరియు ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకుంటారు అనేది చూడాలి.కథకు తగ్గట్లుగా ఉండి పరువు పోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ టైటిల్‌ ఉంచినా పర్వాలేదు అని కళ్యాణ్‌ దేవ్‌ భావిస్తున్నాడు.

స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసిన తర్వాత దర్శకుడు పులివాసు చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీకి కథ చెప్పబోతున్నాడు.వారంతా ఓకే అంటే అప్పుడు సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు