ఆకట్టుకుంటున్న మెగా అల్లుడు కిన్నెరసాని ఫస్ట్ గ్లింప్స్

మెగా అల్లుడుగా కళ్యాణ్ దేవ్విజేత’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

అయితే ఆ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో, ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాలను రెడీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ‘సూపర్ మచ్చి’ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమైన కళ్యాణ్ దేవ్, తాజాగా మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు.గతంలో నాగశౌర్యతో కలిసి ‘అశ్వద్ధామ’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రమణ తేజ ‘కిన్నెరసాని’ అనే సినిమాను కళ్యాణ్ దేవ్‌తో కలిసి రూపొందిస్తు్న్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ నూతన సంవత్సర కానుకగా రిలీజ్ చేశారు.ఈ ఫస్ట్ గ్లింప్స్ చాలా ఆర్టిస్టిక్‌గా ఉండటం, దానికి తగ్గట్టుగా ఆకట్టుకునే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉండటంతో ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది.

హీరో ఏకాంతంగా ఉండి ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తూ ఈ గ్లింప్స్ ఉండటంతో ఈ సినిమా ఎలాంటి కంటెంట్‌తో రాబోతుందా అని అప్పుడే ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ కంటెంట్ ఉన్న చిత్రంతో మనముందుకు రానున్నట్లు ఈ గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది.

Advertisement

రమణతేజ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఎస్ఆర్‌టీ ఎంటర్టైన్మెంట్స్ మరియు శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రామ్ తాళ్లూరి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.మహతి సాగర్ ఈ సినిమాకు ఫీల్ గుడ్ సంగీతాన్ని అందించేందుకు సిద్ధమయ్యాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మాత్రం చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.ఇక ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాను వీలైనంత త్వరగా ముగించేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరి ఈ ‘కిన్నెరసాని’ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు
Advertisement

తాజా వార్తలు