కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అన్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.కానీ మేడిగడ్డ బ్యారేజ్ ఐదు పిల్లర్లు కుంగిపోయాయని తెలిపారు.
ప్రాజెక్టు పేరుతో ప్రజా ధనాన్ని వృధా చేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు.తెలంగాణకు కాళేశ్వరం గుదిబండలా తయారైందన్నారు.రూ.30 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు.అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఐదు పిల్లర్లు కుంగిపోయిన సంగతి తెలిసిందే.