సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హిట్టైన సమయంలో ఏ స్థాయిలో ప్రశంసలు వస్తాయో సినిమా ఫ్లాపైతే అదే స్థాయిలో విమర్శలు వస్తాయి.భోళా శంకర్ సినిమా విషయంలో చిరంజీవి తప్పు లేకపోయినా ఆయనను ఏ స్థాయిలో ట్రోల్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
భోళా శంకర్( Bhola Shankar ) సినిమా ఫ్లాప్ రిజల్ట్ తో చిరంజీవి కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) విమర్శించే వాళ్ల నోర్లు మూయించడం కోసం తర్వాత సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నారు.ఈ సినిమాకు ముల్లోక వీరుడు టైటిల్ తో పాటు మరికొన్ని టైటిల్స్ ను సైతం పరిశీలిస్తున్నారు.అయితే ఈ సినిమాతో చిరంజీవి మరో ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకుంటాననే నమ్మకంతో ఉన్నారు.
సోషియో ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది.పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.
చిరంజీవి కెరీర్ ప్లానింగ్స్ కూడా వేరే లెవెల్ లో ఉన్నాయని గత సినిమాలకు సంబంధించి జరిగిన తప్పులు తర్వాత సినిమాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవని చిరంజీవి భావిస్తున్నారని తెలుస్తోంది.భారీ లెవెల్ లో, భారీ బడ్జెట్ తో మెగాస్టార్ చిరంజీవి సినిమాలు తెరకెక్కుతుండటం గమనార్హం. తొలి సినిమాతోనే ప్రూవ్ చేసుకున్న వశిష్ట ( Mallidi Vasishta )రెండో సినిమాతో అంతకు మించి సక్సెస్ సాధిస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.ఈ సినిమాతో వశిష్ట ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా కథ, కథనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.
చిరంజీవికి ఈ సినిమాతో తొలి పాన్ ఇండియా హిట్ దక్కుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సినిమా సినిమాకు చిరంజీవి రేంజ్ పెరుగుతోంది.చిరంజీవి కెరీర్ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది.