పవన్ కల్యాణ్ తో కాకినాడ జిల్లా టీడీపీ ప్రతినిధుల భేటీ..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కాకినాడ జిల్లా టీడీపీ ప్రతినిధులు కలిశారు.

గత మూడు రోజులుగా కాకినాడలో పవన్ కల్యాణ్ సమీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే కాకినాడ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల టీడీపీ నేతలతో పవన్ సమావేశం అయ్యారు.మూడు రోజుల సమీక్ష తరువాత వివరాలను జనసేనాని టీడీపీ నేతలకు వివరించనున్నారు.

అలాగే ప్రధానంగా జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు టీడీపీ - జనసేన ఏ విధంగా ముందకు వెళ్లాలనే అంశంపై నేతలు ప్రధానంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది.గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలకు చెందిన నేతలను కలుపుకుని ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు