వెండితెర చందమామ కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) తాజాగా సోషల్ మీడియా వేదికగా తన భర్తతో దిగినటువంటి కొన్ని క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈమె అక్టోబర్ 30వ తేదీకి తన పెళ్లి జరిగి మూడు సంవత్సరాలు పూర్తి కావడంతో పెళ్లి రోజు సందర్భంగా తన భర్తతో కలిసి ఉన్నటువంటి కొన్ని క్యూట్ అండ్ రేర్ రొమాంటిక్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఈ ఫోటోలపై కామెంట్స్ చేస్తూ కాజల్ అగర్వాల్ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితులు గౌతమ్ కిచ్లు( Gautam Kitchlu ) అనే వ్యక్తిని సరిగా మూడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.వీరి వివాహ ముంబైలో ఎంతో ఘనంగా జరిగింది.ఇలా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినటువంటి ఈ దంపతులు పెళ్లైన ఏడాదిన్నరకు బాబుకు జన్మనిచ్చారు.
ప్రస్తుతం ఈ దంపతులు తమ కుమారుడు నీల్ కిచ్లు ( Neil Kitchlu ) తో కలిసి ఎంతో సంతోషంగా ఉన్నారు.ఇలా కాజల్ ఒకవైపు తన వ్యక్తిగత జీవితానికి పూర్తి సమయాన్ని కేటాయిస్తూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ వృత్తిపరమైన జీవితాన్ని కూడా చాలా అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు.

ఇక తమ మూడవ పెళ్లి రోజు కావడంతో కాజల్ అగర్వాల్ తన భర్తతో ఉన్నటువంటి కొన్ని రేర్ ఫోటోలను ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎంతో స్నేహపూర్వకంగా మూడు సంవత్సరాలు పూర్తి అయ్యాయి అంటూ తమ పెళ్లిరోజును( Kajal Aggarwal Third Marriage Anniversary ) గుర్తు చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు చూసినటువంటి అభిమానులు ఇతర సెలబ్రిటీలు ఈ దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక కాజల్ సినిమాల విషయానికి వస్తే తాజాగా భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.త్వరలోనే ఇండియన్ 2 విడుదల కాబోతుంది.
అలాగే ఈమె సత్యభామ సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉన్నారు.







